ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ పవన్ వస్తాడా?
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం టాలీవుడ్లో ఇపుడు ఓ ఐకాన్. ఆయన నటించక పోయినా సరే....ఆయన ఫోటో వాడుకున్నా, ఆయన చేతుల మీదుగా ఆడియో వేడుక జరిపినా, ఆయన పాటను తమ సినిమాలో రీమిక్స్ చేసినా కలెక్షన్ల వర్షం కురుస్తోంది. అన్నికంటే ముఖ్యంగా ఆయన వస్తే ఆ సినిమాకు ఫ్రీ పబ్లిసిటీ వస్తుంది. అందుకే ఆయన కోసం చాలా మంది ప్రయత్నాలు చేస్తారు.

గతంలో తను నటించిన సినిమా ఆడియో వేడుకకు పవన్ కళ్యాణ్‌ను ఆహ్వానించిన సక్సెస్ అందుకున్న నితిన్...మరోసారి అదే ప్రయత్నంలో ఉన్నారట. నితిన్ నటిస్తున్న ‘చిన్నదాన నీకోసం' ఆడియో వేడుక ఈ నెల 25న ప్లాన్ చస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకుడు కరుణాకరన్. గతంలో ఈ దర్శకుడు పవన్ కళ్యాణ్‍తో ‘తొలిప్రేమ' వంటి ఎవర్ గ్రీన్ బ్లాక్ బస్టర్ తెరకెక్కించారు. ఈ ఆడియో వేడుకకు పవన్ కళ్యాణ్‌ను రప్పించేందుకు తన శక్తిమేర ప్రయత్నిస్తున్నాడట నితిన్. మరి పవర్ స్టార్ కరుణిస్తాడో? లేదో చూడాలి.
ఈ చిత్రానికి "అమృతం" ఫేం హర్షవర్థన్ మాటలు అందిస్తున్నాడు. ఇష్క్, గుండె జారి గల్లంతయ్యిందే చిత్రాలలకు సంగీతం అందించిన అనూప్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రాన్ని నితిన్ సోదరి నికితా రెడ్డి నిర్మిస్తున్నారు. నితిన్ సరసన మిష్టి చక్రవర్తి నటిస్తోంది. సాఫ్ట్ లవ్ స్టోరీస్ తో ప్రేక్షకులను మెప్పించే కరుణాకరన్, నితిన్ కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రం అంచనాలు భారీగానే ఉన్నాయి.


Click it and Unblock the Notifications











