పికే అంటే : పవన్ కళ్యాణ్ కాదు..పనిలేని కళ్యాణ్ (వీడియో)

By Srikanya

హైదరాబాద్ : నా పేరు కళ్యాణ్ సార్..ఫ్రెండ్స్ అంతా పీకే అంటూంటారు. పీకే అంటే పవన్ కళ్యాణా ....పని లేని కళ్యాణ్ అని నితిన్ చెప్తున్నాడు. నితిన్ వీరాభిమాని ఈ డైలాగు చెప్పటం ఏంటా అనుకుంటున్నారా. అయితే ఇది చదవాల్సిందే.

నితిన్‌ హీరోగా నటించిన చిత్రం 'కొరియర్‌ బాయ్‌ కళ్యాణ్‌'. యామీ గౌతమ్‌ హీరోయిన్. ప్రముఖ దర్శకుడు గౌతమ్‌ వాసుదేవ్‌ మేనన్‌ ఈ చిత్రానికి సమర్పకుడు. ప్రేమ్‌సాయి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. గురు ఫిలింస్‌, మల్టీడైమెన్షన్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంయుక్తంగా నిర్మించాయి. కార్తీక్‌, అనూప్‌ సంగీతం అందించారు. తాజాగా ఈ చిత్రం థియోటర్ ట్రైలర్ విడుదల చేసారు. ఆ ట్రైలర్ లోవి పైన చెప్పిన డైలాగులు. ఆ ట్రైలర్ ఈ క్రింద చూడండి.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

నితిన్‌ మాట్లాడుతూ ''ఈ సినిమా కోసం గౌతమ్‌ మేనన్‌, ప్రేమ్‌సాయి చాలా కష్టపడ్డారు. నా దృష్టిలో ఈ సినిమాకి వాళ్లే హీరోలు. సన్నివేశాలు సహజంగా ఉంటాయి. భారతీయ వెండి తెరపై ఇలాంటి కథాంశంతో ఎవ్వరూ సినిమా తీయలేదు. కొత్తదనం కోరుకొనే ప్రేక్షకులకు ఈ చిత్రం బాగా నచ్చుతుంది''అన్నారు.

Nitin's Courier Boy Kalyan Movie Theatrical Trailer

గౌతమ్‌ మేనన్‌ చెబుతూ ''తెలుగులో నేను నిర్మించిన తొలి చిత్రమిది. కథ నచ్చే ప్రేమ్‌సాయికి అవకాశం ఇచ్చాను. అందరూ తమ వంతు సహకారం అందించారు''అన్నారు.

దర్శకుడు మాట్లాడుతూ ''ఓ కొరియర్‌ బోయ్‌ కథ ఇది. ఓ కొరియర్‌ వల్ల ఎలాంటి సమస్యల్లో చిక్కుకొన్నాడు, అందులోంచి ఎలా బయటపడ్డాడు అనేదే ఈ సినిమా. వినోదం, యాక్షన్‌, థ్రిల్‌ కలగలిపిన ప్రేమకథ ఇది. కార్తీక్‌, అనూప్‌ రూబెన్స్‌ అందించిన సంగీతం ఆకట్టుకొంటుంది. తెలుగు, తమిళ భాషల్లో చిత్రాన్ని ఒకేసారి విడుదల చేస్తున్నాము''అన్నారు.

గౌతమ్ మీనన్ మాట్లాడుతూ....''ఈ సినిమా ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి చాలా కారణాలున్నాయి. తెలుగులో షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. తమిళంలో జీవా కాల్షీట్లు కావల్సినన్ని దొరకలేదు. రెండు భాషల్లో సినిమాని ఒకేసారి విడుదల చేయాలనుకొన్నప్పుడు ఇలాంటి ఇబ్బందులు తప్పవు'' అని చెప్పుకొచ్చారు.

అశుతోష్‌ రాణా, నాజర్‌, సత్యం రాజేష్‌, సప్తగిరి, రవి ప్రకాష్‌, యింటూరి వాసు తదితరులు నటించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X