రాష్ట్ర విభజన వల్లే నితిన్ సినిమా ఆపాం: నందినీరెడ్డి

By Bojja Kumar

హైదరాబాద్: 'అలా మొదలైంది' దర్శకురాలు నందినీరెడ్డి, యంగ్ హీరో నితిన్ కాంబినేషన్లో ఓ సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం ఆగి పోయినట్లు దర్శకురాలు నందినీరెడ్డి ప్రకటించారు. దీనికి ఆమె చెబుతున్న కారణం రాష్ట్రం రెండుగా విడిపోవడమే అంటున్నారు. విభజన వల్ల టాక్స్ సమస్యలు తలెత్తుతాయనే సినిమా ఆపినట్లు ఆమె తెలిపారు.

ఈ మేరుక ఆమె ఒక స్టేట్మెంట్. 'హీరో నితిన్‌తో ఓ సినిమా చేయాలని ప్లాన్ చేసుకున్నాం. అంతా ఫైనలైజ్ అయింది. అయితే రాష్ట్ర విభజన కారణంగా ఈ సినిమాను ఆపాల్సిన పరిస్థితి ఏర్పడింది. సినిమా మొదలు పెడితే అనేక టాక్స్ సమస్యలు వస్తాయని అర్థమైంది. అందుకే మేము చాన్స్ తీసుకోదలుచుకోలేదు. ఆ సమస్యలు ఓ కొలిక్కి వచ్చిన తర్వాత ఈ సినిమా గురించి ఆలోచిస్తాం' అన్నారు.

 Nitin's Film Is On Hold Due To AP Bifurcation: Nandini Reddy

నితిన్ నటించిన 'హార్ట్ ఎటాక్' చిత్రం విడుదలకు ఒక రోజు ముందు నితిన్-నందినీ రెడ్డి ప్రాజెక్టును లాంచనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. కాగా....దర్శకురాలు నందినీ రెడ్డి త్వరలో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. తెలుగులో హిట్టయిన 'అలా మొదలైంది' చిత్రాన్ని ఆమె హిందీలో రీమేక్ చేయబోతున్నారు.

బాలీవుడ్ ఎంట్రీపై దర్శకులురాలు నందినీ రెడ్డిని మీడియా వారు ప్రశ్నించగా 'అలా మొదలైంది' చిత్రం హిందీలో రీమేక్ చేస్తున్న విషయం వాస్తవమే అన్నారు. అయితే పూర్తి వివరాలు ఇప్పుడే చెప్పేందుకు ఆమె ఇష్ట పడటం లేదు. ఓ పెద్ద ప్రొడక్షన్ కంపెనీ ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నారు. అందువల్ల ఇప్పుడే ఏవిషయాన్ని నేను బయటకు చెప్పదలుచుకోలేదు అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X