పూరి మార్క్ లవ్ స్టోరీ (‘హార్ట్ ఎటాక్’ప్రివ్యూ)

By Srikanya

హైదరాబాద్ : లవ్ స్టోరీలు తీయటంలో పూరీ తీరే వేరు. మొదటి నుంచి ప్రత్యేకమైన శైలితో హీరో క్యారెక్టర్ పై కాన్సర్టేట్ చేస్తూ చిత్రాలు చేస్తూ వస్తున్న పూరీ జగన్నాథ్ ఈ మధ్యన లవ్ స్టోరీలు ఏమీ తియ్యలేదు. దాంతో ఇడియట్ లాంటి లవ్ స్టోరీని ఈ చిత్రం కోసం రాసి,తీసానంటూ ఈ చిత్రం గురించి చెప్తున్నారు. ఈ చిత్రం టీజర్స్ ఇప్పటికే మంచి క్రేజ్ తెచ్చుకున్నాయి. ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి.

చిత్రంలో వరుణ్‌ గా నితిన్ కనిపిస్తారు. వరుణ్ ఓ ట్రావెలర్‌. ప్రపంచం అంతా చుట్టేయడం, అక్కడున్న అందాల్ని ఆస్వాదించడం అతని హాబీ. ప్రేమపై పెద్దగా నమ్మకాలేం లేవు. ట్రావెలింగ్‌లో భాగంగా స్పెయిన్‌ వెళ్తాడు. అక్కడే హయాతి (అదాశర్మ) పరిచయం అవుతుంది. ఆమెది కాస్త విభిన్నమైన వ్యక్తిత్వం. కదిలిస్తే చాలు.. బాధ్యతలు, బంధాల గురించి మాట్లాడుతుంది. అయితే ఒకరినొకరు ఇష్టపడతారు. మరి వీరిద్దరికీ పొంతన కుదిరిందా? వాళ్ల ప్రేమ విజయవంతమైందా? ఇంతకీ హయాతి స్పెయిన్‌ ఎందుకు వెళ్లింది? అన్నదే 'హార్ట్‌ ఎటాక్‌' కథ.

Nitin’s Heart Attack preview

పూరీ జగన్నాథ్ మాట్లాడుతూ...''చాలాకాలం తరవాత నేను చేస్తున్న ప్రేమ కథ ఇది. ఓ హృదయం మరో హృదయాన్ని ఢీ కొట్టుకోవడమే.. హార్ట్‌ఎటాక్‌. మా ప్రయత్నం కచ్చితంగా అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది. అనూప్‌ అందించిన బాణీలు అందరికీ నచ్చాయి. అమోల్‌ రాథోడ్‌ కెమెరా పనితనం కూడా ఆకట్టుకొంటుంది'' అన్నారు.

నితిన్ మాట్లాడుతూ...''పూరి సార్‌తో పనిచేయాలని ఎప్పటి నుంచో అనుకొంటున్నా. ఇప్పటికి కుదిరింది. ఈ సినిమాలో నేను చాలా స్త్టెలిష్‌గా కనిపిస్తా. నన్ను తెరపై కొత్తగా చూపించారు. అనూప్‌ మరోసారి మంచి పాటలిచ్చాడు. మా ఇద్దరి కలయికలో ఇది హ్యాట్రిక్‌ చిత్రం అవుతుంది'' అన్నారు.

హీరోయిన్ అదాశర్మ మాట్లాడుతూ...''ఈ సినిమా కోసం వంద మందిని ఆడిషన్స్‌ చేశారట. నేను నూట ఒకటో అమ్మాయిని. నా పాత్రలో రెండు షేడ్స్‌ ఉంటాయి. చాలా సీరియస్‌గా సాగే పాత్ర. ఈ సినిమాలో రెండే రెండు సార్లు నవ్వా. కథక్‌ డాన్సర్‌ని అయినా.. అసలు డాన్స్‌ చేసే అవకాశమే ఇవ్వలేదు నాకు. కానీ నా పాత్రని నేను చాలా ఆస్వాదించా'' అంది.

చిత్రం: హార్ట్‌ ఎటాక్‌,
సంస్థ: పూరి టూరింగ్‌ టాకీస్‌
నటీనటులు: నితిన్‌, అదాశర్మ, అజీజ్‌ఖాన్‌, అలీ, బ్రహ్మానందం తదితరులు
సంగీతం: అనూప్‌ రూబెన్స్‌,
పాటలు: భాస్కరభట్ల,
కెమెరా: ఆమోల్ రాథోడ్,
ఎడిటింగ్: ఎస్.ఆర్. శేఖర్,
ఆర్ట్: బ్రహ్మ కడలి,
ఫైట్స్: రామ్-లక్ష్మణ్,
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం ,నిర్మాత : పూరి జగన్నాథ్.
సమర్పణ : లావణ్య
విడుదల: 31,జనవరి,2014.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X