టుడే రిలీజ్ నితిన్ 'ఇష్క్'టాక్
నితిన్ తాజా చిత్రం ఇష్క్ ఈ రోజు విడుదలైంది. నిత్యామీనన్ కాంబినేషన్ లో 13బి డైరక్టర్ విక్రమ్ డైరక్ట్ చేసిన ఈ చిత్రం క్లాస్ రొమాంటిక్ లవ్ స్టోరీ అని తెలుస్తోంది. చిత్రంలో అమాయకంగా కనపడటం కోసం కొంత బరువు పెరిగిన నితిన్ కి ఈ చిత్రం ఈ చిత్రం ప్లస్ అవుతుందని చెప్తున్నారు. ఏమి మాయ చేసావే తరహాలో మల్టి ప్లెక్స్ వర్గానికి పట్టే అవకాశముందని చెప్తున్నారు. ముఖ్యంగా సినిమాకు ఛాయాగ్రహణం అందించిన పి.సి శ్రీరామ్ తెరపై అద్బుతమే చేసాడని తెలుస్తోంది. ఇక నిత్యామీనన్ తన సహజమైన నటనతో ఆకట్టుకుంది. ముఖ్యంగా గోవా ఎపిసోడ్స్ లో ఆమె శారీలో కనపించి అదరకొట్టింది. అజయ్ ఢిఫెరెంట్ షేడ్స్ తో కూడిన పాత్రను పోషించాడు. అలాగే కొన్ని సన్నివేశాల్లో అతను కామెడీని పండించటం జరిగింది. అలాగే నితిన్ సోదరిగా సింధు తులాని,నితిన్ ప్రెండ్ గా అలీ రెగ్యులర్ గా చేసుకుంటూ పోయారు. తాగుబోతు రమేష్ వేస్ట్ అయ్యాడు. ఇక సినిమా కథ విషయానికి వస్తే రొటీన్ లవ్ స్టోరీ అయినా ట్రీట్ మెంట్ పరంగా కొత్తగా స్క్ర్రీన్ ప్లే రాసుకుని ప్రెజెంట్ చేసి దర్శకుడు సక్సెస్ అయ్యాడు. తను ప్రేమించిన అమ్మాయి కుటుంబాన్ని ఎలా ఒఫ్పించాడు అన్న పాయింట్ చుట్టూనే కథ తిరుగుతుంది. మాస్ కి నచ్చే ఎలిమెంట్స్ లేకపోవటం, కమర్షియల్ ఏస్పెక్ట్ లో లేకపోవటం కొంత వరకూ రెగ్యులర్ ప్రేక్షకుడుకి ఇబ్బంది పెడుతుంది. కానీ ప్రెష్ గా ఫీలయ్యే సీన్స్ తో ఓ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ చూద్దామని ఫిక్స్ అయ్యితే మాత్రం నిరాశపరచదని చెప్తున్నారు.


Click it and Unblock the Notifications











