వెనక్కి వెళ్లిన మాచర్ల నియోజకవర్గం.. రిలీజ్ ఎప్పుడంటే?
వరుస ఫ్లాప్ లతో ఇబ్బంది పడిన హీరో నితిన్ ఎట్టకేలకు వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన భీష్మ సినిమాతో హిట్ అందుకున్నాడు. అయితే ఆ తర్వాత ఆయన హీరోగా వచ్చిన రెండు సినిమాలు కూడా పెద్దగా సక్సెస్ అవ్వలేదు. నితిన్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన రంగ్ దే సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు. అలాగే మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన మ్యాస్ట్రో సినిమా కూడా ప్రేక్షకుల అంచనాలకు ఏ మాత్రం అందుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో నితిన్ ఎలా అయినా సరైన హిట్ కొట్టాలని చూస్తున్నాడు. అందులో భాగంగానే ఈ సారి ఒక పొలిటికల్ థ్రిల్లర్ సినిమా చేస్తున్నాడు. తెలుగులో ఎడిటర్ గా కొన్ని సినిమాలకు వ్యవహరించిన ఎం ఎస్ రాజశేఖర్ రెడ్డి నూతన దర్శకుడిగా పరిచయమవుతున్న తాజా చిత్రం మాచర్ల నియోజకవర్గం.
ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అయితే ఈ సినిమాని తొలుత జూలై నెలలో విడుదల చేయాలని భావించారు. కానీ ఇప్పుడు దాని వాయిదా వేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తొలుత జూలై 8 వ తేదీన సినిమా విడుదల చేయాలనుకున్నారు. తర్వాత ఏమైందో ఏమో తెలియదు గానీ ఆగస్టు 12వ తేదీన సినిమాను విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటన చేశారు. ఈ మేరకు కొత్త పోస్టర్ ను నితిన్ తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా పంచుకున్నారు.

ఇక ఈ సినిమాలో నితిన్ సరసన హీరోయిన్లుగా క్యాథరిన్ తెరిసా, కృతి శెట్టి నటిస్తున్నారు. పూర్తిస్థాయి పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నితిన్ సిద్ధార్థ రెడ్డి అనే ఒక జిల్లా కలెక్టర్ అధికారిగా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో జిల్లాలు పునర్విభజన జరిగింది. కానీ ఒకప్పుడు గుంటూరు జిల్లా పరిధిలోకి మాచర్ల నియోజకవర్గం కూడా వచ్చేది ఈ నేపధ్యంలోనే నితిన్ గుంటూరు జిల్లా కలెక్టర్ గా ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రేష్ట్ మూవీస్ పతాకాలపై ఎన్. సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మహతి స్వర సాగర్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. నితిన్‌తో ఆయనకు మూడో సినిమా. ఇంతకు ముందు 'భీష్మ', 'మాస్ట్రో' సినిమాలకు పని చేశారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమా ఒక పూర్తిస్థాయి పొలిటికల్ థ్రిల్లర్ అయినా సరే ఫుల్ ప్యాక్డ్ మాస్ ఎంటర్టైనర్ ఫీల్ వస్తుందని మేకర్స్ అంటున్నారు. అయితే నితిన్ సినిమా ఎందుకు వాయిదా పడింది అనే విషయం మీద ఎలాంటి క్లారిటీ లేదు. నిజానికి పెద్ద సినిమాలు అనుకున్నవన్నీ ఇప్పటికే రంగంలోకి దిగి పోయాయి. మహేష్ బాబు హీరోగా నటించిన సర్కార్ సినిమా కూడా మే 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అయితే ఈ సమయంలో ఈ సినిమాను ఎందుకో వాయిదా వేశారు అనే విషయం మాత్రం క్లారిటీ లేదు.


Click it and Unblock the Notifications











