కొలవెరి రేంజ్ లో...నితిన్ ‘కొడిపాయె లచ్చమ్మది’
కొలవెరి పాట ద్వారా రజనీకాంత్ అల్లుడు ధనుష్ దేశ వ్యాప్తంగా పాపులర్ అయిన సంగతి తెలిసిందే. ధనుష్ అంత కాక పోయినా...తమ సినిమా ప్రచారం పెంచుకోవడానికి చాలా మంది స్టార్స్ మైక్ పట్టి పాడటం మొదలు పెట్టారు. తాజాగా తెలుగులో ఇటీవల బిజినెస్ మేన్ సినిమా కోసం మహేష్ బాబు, పూరి పాట పాడితే...తాజాగా యువ హీరో నితిన్ తన రాబోయే సినిమా 'ఇష్క్' కోసం 'కోడిపాయె లచ్చమ్మ' అనే పాపులర్ జానపద గీతాన్ని ఆలపించాడు. సినిమా ప్రమోషన్లో భాగంగా నితిన్ పాట పాడుతుండగా తీసిన వీడియోలోను నోట్ లోకి వదిలారు.
నితిన్-నిత్య మీనన్ జంటగా నటిస్తున్న ఇష్క్ మూవీ యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాకు విక్రకమ్ కుమార్(13 బి ఫేం) దర్శకత్వం వహిస్తున్నారు. శ్రేష్ఠ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమాను విక్రమ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు అరవింద్ శంకర్ సంగీతం అందిస్తుండగా, సినిమాటో గ్రపీ : పిసి శ్రీరామ్, ఆర్ట్ : రాజీవన్, ఈ సినిమాలో ఇంకా అజయ్, అలి, శ్రీనివాస్ రెడ్డి, సింధు తరుణి, నాగినీడు, సత్యకృష్ణ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.


Click it and Unblock the Notifications











