నితిన్‌కీ 'కిక్‌' ఇస్తానంటున్నాడు

By Srikanya

Nitin
హైదరాబాద్: యాక్షన్‌ చిత్రాల దర్శకుడిగా సురేందర్‌రెడ్డి పేరు తెచ్చుకొన్నారు. 'అతనొక్కడే', 'కిక్‌' విజయాలు ఆయన ఖాతాలో ఉన్నాయి. నితిన్‌దేమో ప్రేమ బాట. ఈమధ్య లవ్‌స్టోరీలతో విజయాలు అందుకొంటున్నారు. అయితే అందులోనూ యాక్షన్‌ అంశాల్ని మిక్స్‌ చేస్తుంటారు. అందుకే వీరిద్దరి జోడీ కుదిరిందిప్పుడు. నితిన్‌, సురేందర్‌రెడ్డి కలయికలో ఓ చిత్రం రూపుదిద్దుకొనే అవకాశాలున్నాయి.

'నితిన్‌తో ఓ సినిమా చేయాలనుకొంటున్నా. అయితే అదింకా చర్చల దశలోనే ఉంది' అని మీడియాతో చెప్పారు సురేందర్‌రెడ్డి. ఈ చిత్రం కిక్ కి సీక్వెల్ అయ్యి ఉండే అవకాసముందని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన అల్లుఅర్జున్‌ని 'రేసుగుర్రం'లా మార్చే పనిలో ఉన్నారు. ఈ చిత్రం ఫిబ్రవరిలో విడుదల కానుంది. ఆ తరవాతే నితిన్‌తో సినిమా చేసే అవకాశాలున్నాయి.

ఇక పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నితిన్ హీరోగా 'హార్ట్‌ఎటాక్‌' చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే . ఈ చిత్రం హీరో క్యారక్టరైజేషన్ తో నడుస్తుందని తెలుస్తోంది. ఈ చిత్రంలో నితిన్‌ని ఓ పోకిరి ప్రేమికుడిగా చూపించబోతున్నారు. తొలిసారిగా నితిన్ ...పూరి దర్శకత్వంలో నటించటంపై మంచి అంచానాలే ఉన్నాయి. ఈ చిత్రం సంక్రాంతికి విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. అందుకోసం చాలా వేగవంతంగా షూటింగ్ జరుపుతున్నారు. నితిన్ చిత్రం విడుదల పై ట్వీట్ చేస్తూ...నా 'హార్ట్‌ఎటాక్‌' చిత్రం పూర్తి ప్రేమ కధా చిత్రం. సంక్రాంతికి విడుదల అవుతుంది.

నిర్మాత మాట్లాడుతూ... ''మాస్‌, క్లాస్‌ అంశాలు మేళవించిన ప్రేమ కథ ఇది. నితిన్‌ గెటప్‌, ఆయన పాత్ర చిత్రణ ఆకట్టుకొంటాయి. స్పెయిన్‌లో చిత్రీకరించిన సన్నివేశాలు ఆకర్షణగా నిలుస్తాయి. అనూప్‌ రూబెన్స్‌ అందించిన పాటలు యువతరాన్ని అలరిస్తాయనే నమ్మకం ఉంది'' అని చెప్తున్నారు. ప్రేమ కథలు తెరకెక్కించడంలో పూరి జగన్నాథ్‌ది ప్రత్యేక శైలి. అందులోనే వినోదం, పోరాట దృశ్యాలు ఉండేలా జాగ్రత్త పడతారు. ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'హార్ట్‌ఎటాక్‌'. పూరి జగన్నాథ్‌ టూరింగ్‌ టాకీస్‌ సంస్థ తెరకెక్కిస్తోంది. నితిన్‌ సరసన ఆదా శర్మ హీరోయిన్ .

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X