నితిన్ ట్వీట్ ట్విస్ట్: పవన్ కళ్యాణ్ కాదు...నాగార్జున!
హైదరాబాద్: ఇష్క్, గుండె జారి గల్లంతయ్యిందే చిత్రాలతో వరుస హిట్లు అందుకున్న నితిన్ ఆ తర్వాత ‘హార్ట్ ఎటాక్' చిత్రంతో యూత్ ను మెప్పించాడు. దీని తర్వాత ‘తొలి ప్రేమ' ఫేం కరుణాకరన్ దర్శకత్వంలో ‘చినదానా నీకోసం' చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఆడియో రేపు (నవంబర్ 27) విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
నితిన్...పవన్ కళ్యాణ్ వీరాభిమాని. గతంలో తన సినిమా ఆడియో వేడుకకు ఆయన్నే చీఫ్ గెస్టుగా ఆహ్వానించారు. ఈ సారి కూడా నితిన్ పవన్ కళ్యాణ్‌ను రప్పిస్తారని అంతా అనుకున్నారు. కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ ట్విట్ ద్వారా ట్విస్ట్ ఇచ్చాడు నితిన్. ‘చినదాన నీ కోసం' ఆడియో వేడుకకు నాగార్జున చీఫ్ గెస్టుగా వస్తున్నట్లు ప్రకటించారు.

ఈ చిత్రానికి "అమృతం" ఫేం హర్షవర్థన్ మాటలు అందిస్తున్నాడు. ఇష్క్, గుండె జారి గల్లంతయ్యిందే చిత్రాలలకు సంగీతం అందించిన అనూప్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రాన్ని నితిన్ సోదరి నికితా రెడ్డి నిర్మిస్తున్నారు. నితిన్ సరసన మిష్టి చక్రవర్తి నటిస్తోంది. సాఫ్ట్ లవ్ స్టోరీస్ తో ప్రేక్షకులను మెప్పించే కరుణాకరన్, నితిన్ కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రం అంచనాలు భారీగానే ఉన్నాయి.


Click it and Unblock the Notifications











