నితన్ ...విషెష్ చెప్పాడు

By Srikanya

హైదరాబాద్ : తనతో గుండె జారి గల్లంతైంది చిత్రం చేసి,హిట్ ఇచ్చిన కొండా విజయ్ కుమార్ తాజా చిత్రం ఈ రోజు విడుదల అవుతన్న సంగతీ తెలిసిందే. ఒక లైలా కోసం టైటిల్ తో విడుదల అయ్యే ఈ చిత్రం దర్శకుడుకి, హీరోకు నితిన్ శుభాకాంక్షలు తెలిపారు. తన చిత్రం కన్నా పెద్ద హిట్ కావాలని కోరుకున్నారు. ఈ విషయాన్ని ఆయన ట్వీట్ చేసారు.

నితన్ ట్వీట్ చేస్తూ...'. " నా గుండె జారి గల్లంతైంది దర్శకుడు విజయ్ కొండా, నాగ చైతన్యలకు శుభాకాంక్షలు. వారి ఒక లైలా కోసం చిత్రం గుండె జారి గల్లంతైంది కన్నా పెద్ హిట్ కావాలని కోరుకుంటున్నా...గుడ్ లక్ గైస్ " అన్నారు.

ఇక నితన్ ప్రస్తుతం కరుణాకరన్ తో చిత్రం చేస్తున్నారు. ఆ చిత్రం 'చినదాన నీ కోసం'. ఈ చిత్రంలో ...విదేశాల నుంచి వచ్చిన ఓ యువకుడిగా నితిన్‌ తెరపై సందడి చేయబోతున్నాడని సమచారం.

 Nitin wishes to Konda Vijay Kumar

ఇక వరస పెట్టి లవ్ స్టోరీలు చేసుకుంటూ పోతున్నాడు...ఆ చక్కని, చిక్కని ప్రేమకథల్లో చక్కగా ఇమిడిపోతున్నాడు నితిన్‌. 'ఇష్క్‌', 'గుండెజారి గల్లంతయ్యిందే', 'హార్ట్‌ఎటాక్‌' చిత్రాల్లో ఈ జనరేషన్ లవర్ గా సందడి చేశాడు. ఇప్పుడు ఏకంగా ప్రేమకథా చిత్రాల స్పెషలిస్టుగా ముద్రపడిన కరుణాకరన్‌ దర్శకత్వంలో నటిస్తున్నాడు. 'చినదాన నీ కోసం' పేరుతో శ్రావణ సినిమాస్‌ పతాకంపై ఆ చిత్రం రూపొందుతోంది. మిస్తీ హీరోయిన్.

నిర్మాత నికితా రెడ్డి మాట్లాడుతూ.. ఈ సినిమా ఇండియాతో పాటూ అబ్రాడ్లోనూ భారీ వ్యయంతో చిత్రీకరణ జరుపుకుంది. శ్రేస్ట్ మూవీస్‌లో గతంలో వచ్చిన "ఇష్క్", "గుండేజారి గల్ల౦తయ్యి౦దే" లా౦టి విజయాల అన౦తర౦ తీస్తున్న ఈ మూడో సినిమా కూడా గ్రాండ్‌ సక్సెస్‌ అవుతుందని తెలిపారు.

రేస్ట్ మూవీస్ పతాకం మీద నిఖితారెడ్డి, సుధాకర్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. విక్రమ్‌ గౌడ్ సమర్పకులు. నితిన్ సరసన బాలీవుడ్‌ హీరోయిన్ మిస్తీ జోడి కడుతోంది. ఈ చిత్రానికి మాటలు: హర్షవర్ధన్, సంగీతం: అనుప్ రూబెన్స్, సినిమాటోగ్రఫి: ఆండ్రూ, ఆర్ట్ రాజీవ్ నాయర్, సమర్పణ: విక్రమ్‌ గౌడ్‌.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X