ప్రబాస్ అంటే ఎవరు? అని అడిగి ట్విస్ట్ ఇచ్చిన నిత్యా మీనన్

By Srikanya

అలా మొదలైంది చిత్రంతో పరిచయమైన నిత్యా మీనన్ ఒక్క చిత్రంతోనే పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె రీసెంట్ గా సిద్దార్ధ సరసన 180 చిత్రంలో చేస్తోంది. ఆ చిత్రం ప్రమోషన్ లో భాగంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఓ కాంట్రావర్శీ కామెంట్ చేసింది. ఆమెను మీడియావారు ఆరడుగల పొడవున్న ప్రభాస్ తో సినిమా ఆఫర్ వస్తే ఏక్సెప్ట్ చేస్తారా అని అడిగితే ఆమె వెంటనే తడుముకోకుండా...- 'ఆయనెవరు?' అంది.దాంతో మీడియామీట్ కి వచ్చిన రిపోర్టర్స్ అంతా షాక్ అయ్యారు. అయితే వెంటనే నిత్యా దాన్ని కవర్ చేసుకునే ప్రయత్నం చేసింది.తను పెద్దగా తెలుగు సినిమాలు చూడనని, కాబట్టి తెలుగు హీరోల గురించి తెలియదని అంది.

అలాగే వెంకటేష్‌ సరసన నటించను అని చెప్పాను అని చెప్తూ... దానికి కారణం ఉంది. ఒకసారి ఆయన నేను ఒకే విమానంలో ప్రయాణించాం. అప్పుడు చూశాను. ఆయనేమో ఎత్తుగా అందంగా ఉంటారు. నేనేమో చిన్న పిల్లలా ఉంటాను. పైగా ఆయన సీనియర్‌ హీరో కదా! జనరేషన్‌ గ్యాప్‌ వస్తుంది. ఇప్పటికే నేను హీరోల ఎత్తుకు సరిపోక యాపిల్‌ బాక్స్‌లు, చెక్కపెట్టెలు పెట్టి వాటిపై నిలబడమంటున్నారు. వెంకటేష్‌తో అయితే మరిన్ని పెట్టెలు కావాలేమో! ఆయనతో నటించే అవకాశం రావడం గొప్పే. ఎందుకంటే చాలామంది యువ హీరోల కంటే ఆయన గొప్పనటుడు. ఆరడుగుల హీరోల సరసన నటించాలన్నా నాకు సమస్యగానే ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X