ఆ భయం నాకు లేదు: నిత్యా మీనన్
హైదరాబాద్: ''నా శరీరం నాకు సౌకర్యంగా ఉంటే చాలు. కాస్త లావుగా ఉంటే అవకాశాలు తగ్గిపోతాయనే భయాలు నాకు లేవు. కావాలంటే పాత్ర కోసం స్లిమ్ అవ్వమంటే అవుతా. కానీ పనిగట్టుకొని తగ్గను. లావుగా ఉన్నా ప్రతిభ ఉంటే కచ్చితంగా గుర్తింపు ఉంటుంది. అలా పేరు తెచ్చుకొన్న నటీమణులు ఎంతోమంది ఉన్నారు'' అని చెప్తోంది నిత్యమీనన్. హీరోయిన్స్ అంటే స్లిమ్‌గా ఉండాల్సిందే. తమిళం మాటేమో గానీ తెలుగులో నాజూకైన హీరోయిన్స్ కే గుర్తింపు. కాస్త ఒళ్లు చేసినా అవకాశాలు తగ్గిపోతాయనే భయం ఉంటుంది. అందుకే జీరో సైజ్, వ్యాయామాలూ.. అంటూ రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ నిత్యమీనన్ మాత్రం 'బొద్దుగా ఉంటే తప్పేంటి?' అని అడుగుతోంది.
'గుండె జారి గల్లంతయ్యిందే' చిత్రంతో తన నటన, గ్లామర్‌తో యూత్ మతిపోగొట్టిన నిత్యా మీనన్...త్వరలో 'మాలిని 22' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇదో రివేంజ్ డ్రామా. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్‌తో పోస్టర్లో నిత్యా మీనన్ కత్తి పట్టుకుని దర్శనం ఇస్తోంది. ఈ చిత్రాన్నికి నటి శ్రీప్రియ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగులో పాటు తమిళంలోనూ ఈచిత్రాన్ని విడదుల చేస్తున్నారు. తమిళంలో ఈచిత్రాన్ని '22 మాలిని పాళయం కోట్టై' పేరుతో విడుదల చేయనున్నారు.

ఇది మహిళలపై బలాత్కారం ఇతివృత్తంతో తెరకెక్కుతున్న చిత్రం అని తెలుస్తోంది. 2012లో మళయాలంలో వచ్చిన '22 ఫిమేల్ కొట్టాయం' చిత్రానికి ఇది రీమేక్. ప్రస్తుతం దేశంలో స్త్రీలపై అత్యాచారాలు పెరిగిపోతున్న నేపథ్యంలో....ఈ చిత్రం ఒక సందేశాత్మకంగా, మేలుకొలుపుగా ఉంటుందని అంటున్నారు.
ఇప్పటి వరకు చేసిన సినిమాలకు భిన్నమైన కథాంశం కావడంతో ఇది తన కెరీర్‌కు ప్లస్సవుతుందని నిత్యామీనన్ ఆశిస్తోంది. ప్రస్తుతం ఈచిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సినిమాతో పాటు నిత్యా మీనన్ తెలుగులో 'ఏమిటో ఈ మాయ' అనే చిత్రంలో నటిస్తోంది. శర్వానంద్ హీరోగా నటిస్తున్న ఈచిత్రానికి చేరన్ దర్శకకత్వం వహిస్తున్నారు. ఇదే చిత్రం తమిళంలోనూ విడుదలకానుంది.


Click it and Unblock the Notifications











