లారెన్స్ డైరక్షన్ లో నిత్యమీనన్‌

By Srikanya

Nitya Menon in Muni 3 with Lawrence
హైదరాబాద్ : 'ముని' సినిమాతో భయపెట్టాడు రాఘవేంద్రలారెన్స్‌. దానికి కొనసాగింపుగా 'కాంచన' వచ్చింది. ఈసారి భయానికి వినోదం తోడైంది. ఇప్పుడు మూడో 'ముని' రాబోతోన్నాడు. 'గంగ' పేరుతో. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో తాప్సి హీరోయిన్ గా నటిస్తోంది. మరో కీలకమైన పాత్రలో నిత్యమీనన్‌ కనిపించనుంది. ఆమెపై సన్నివేశాలను కూడా తెరకెక్కించారు.

''నిత్య కోసమే పుట్టిన పాత్ర అది. అందులో నిత్యమీనన్‌ నటన తప్పకుండా ఆకట్టుకొంటుంది. తాప్సికి ఇది మర్చిపోలేని చిత్రం అవుతుంది. ఆమె సినీ ప్రయాణంలో ఇది మైలురాయిగా మిగిలిపోతుంది'' అని దర్శకుడు చెప్తున్నారు. 2014 ఫిబ్రవరిలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.ఇప్పటికే 70 శాతం చిత్రీకరణ పూర్తయింది.

'కాంచన' వంటి సూపర్ డూపర్ హిట్ తర్వాత మళ్లీ దర్శకుడు రాఘవ లారెన్స్, నిర్మాత బెల్లంకొండ సురేష్ కాంబినేషన్లో 'ముని-3' భారీ చిత్రం రాబోతున్న సంగతి తెలిసందే. లారెన్స్ దర్శకత్వం వహిస్తూ హీరోగా నటించే 'ముని-3'లో తాప్సీ హీరోయిన్. ఈ సినిమా కోసం తాప్సీ ఎలాంటి రిస్క్ సీన్లయినా చేయడానికి సై అంటోంది. భయం అనేదే లేకుండా తెగింపుగా ముందుకు సాగుతోంది. ప్రస్తుతం చెన్నైలో ఈమెపై కొన్ని యాక్షన్ సన్నివేశాలను తీస్తున్నారు. ఓ సీన్ కోసం 12గంటలు నీళ్ళలో గడిపింది. అంతసేపు నీళ్లలో గడపడం వల్ల అందం, ఆరోగ్యం పాడవుతుందని, డూప్‌తో ఆ సీన్ చేద్దామని....దర్శక నిర్మాతలు చెప్పినా తాప్సీ వినకపోగా తానే చేస్తానని పట్టుబట్టిందట.

ఈ సినిమా గురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తాప్సీ మాట్లాడుతూ, తన కెరీర్లో ఎన్నడూ చేయని దమ్మున్న పాత్ర చేస్తున్నానని, ప్రేక్షకులను మెప్పిస్తాననే నమ్మకం ఉందని చెప్పుకొచ్చింది. మరి తాప్సీ కష్టానికి తగిన విధంగా ఈ సినిమా ఫలితం ఉండాలని ఆశిద్దాం. రాఘవ లెరెన్స్, తాప్సీ జంటగా నటిస్తున్న ఈ భారీ చిత్రానికి ఫోటోగ్రఫీ: కిచ్చా, సంగీతం: అనిరుధ్‌, సమర్పణ: మల్టీ డైమన్షన్ ఎంటర్ టైన్మెంట్స్, నిర్మాతలు: బెల్లంకొండ సురేష్, బెల్లకొండ గణేష్ బాబు, కథ-స్క్రీన్ ప్లే-కొరియోగ్రఫీ-దర్శకత్వం: రాఘవ లారెన్స్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X