బాలయ్యతో చేయటానికి నిత్యామీనన్‌ ఓకే!?

By Srikanya

హైదరాబాద్ ‌: అవకాశం వస్తే కచ్చితంగా పౌరాణిక సినిమాలో నటిస్తానని నిత్యామీనన్ పేర్కొన్నారు. హైదరాబాద్ లో ఓ సెలూన్ ఓపినింగ్ కి విచ్చేసిన ఆమె మాట్లాడుతూ ఇలా స్పందించారు. మొన్నామధ్య బాలకృష్ణ కొంచెం హైట్ ఉంటే తన పౌరాణిక చిత్రంలో అవకాశం ఇచ్చి ఉందునని అన్న విషయం గుర్తుండే ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే నిత్యామీనన్ ఇలా కామెంట్ చేసారు. ఇది విన్న అభిమానులు ఆమెకు బాలకృష్ణ సరసన నటించాలనే ఆసక్తి ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. మరి బాలకృష్ణ తన పౌరాణిక చిత్రంలో అవకాసం ఇస్తారో లేదో చూడాలని అంటున్నారు.

నారా రోహిత్ తాజా మూవీ 'ఒక్కడినే' ఆడియో కార్యక్రమంలో పాల్గొన్న బాలకృష్ణ మాట్లాడుతూ...నర్తనశాల కోసం ద్రౌపతి కోసం వెతుకుతున్నాం. నిత్యా కొంచెం హైట్ ఉండుంటే నా సినిమాలో ద్రౌపతిగా అవకాశం ఇచ్చే వాళ్లం. ఆమె అచ్చమైన తెలుగుమ్మాయిలా ఉంది....అంటూ హీరోయిన్ నిత్యా మీనన్ గురించి వ్యాఖ్యానించారు. అలాగే నిత్యా మీనన్ సౌందర్య, సావిత్రి లాంటి నటి, నంది అవార్డు కూడా పొందింది అంటూ కొనియాడారు.

అలాగే తనకు సినీజీవితంలో డ్రీమ్‌ రోల్‌ అంటూ ఏదీ లేదని తెలిపారు. అలాగే ... తాను నటించిన ఒక్కడినే సినిమా డిసెంబరులో విడుదలకానుందని వివరించారు. ఈ సినిమా థ్రిల్లర్‌, కుటుంబ కథ నేపథ్యంలో సాగుతుందన్నారు. నారా రోహిత్, నిత్యా మీనన్ నటీనటులుగా గులాబీ మూవీస్ బేనర్ పై నిర్మాత సి.వి.రెడ్డి నిర్మిస్తున్న చిత్రం 'ఒక్కడినే'. శ్రీనివాస్ రాగ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రంలో రోహిత్ సరసన నిత్యా మీనన్ హీరోయిన్ గా చేస్తోంది.

'ఒక్కడినే' గురించి దర్శకుడు మాట్లాడుతూ... ఓ అందాల భామ... సూర్యను చూడగానే మనసిచ్చేసింది. నా ప్రేమ తొలకరి సంగీతం లాంటిది అంటూ ప్రణయ గీతాలు అందుకొంది. సూర్య కూడా ఆమెను ఇష్టపడ్డాడు. వారి ప్రణయం పెళ్లి పీటల దగ్గరకు వెళ్లేసరికే అసలు ఇబ్బందులు మొదలయ్యాయి. అవేమిటో తెర మీదే చూడాలి అన్నారు. ఈ నెల 23న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. నిర్మాత సి.వి.రెడ్డి మాట్లాడుతూ ''మనసిచ్చిన యువతి కోసం కుటుంబాన్ని వదులుకోవాల్సిన పరిస్థితి ఎదుర్కొన్న యువకుడి కథ ఇది. అతను ఒంటరి కావడం వెనకున్న కారణాలేంటి? అనేది తెరపైనే చూడాలి. నారా రోహిత్‌ నటన అన్ని వర్గాల ప్రేక్షకులకీ నచ్చుతుంది'' అన్నారు. ఛాయాగ్రహణం: ఆండ్రూ, సంగీతం: కార్తీక్‌.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X