Nivetha Pethuraj బాలీవుడ్‌లోకి ధమ్కీ భామ ఎంట్రీ.. ముంబైలో ఖరీదైన ఇల్లు కొన్న నివేదా పేతురాజ్
తమిళ, తెలుగు ప్రేక్షకులను తన నటన, గ్లామర్‌తో ఆకట్టుకొన్న టాలెంటెడ్ హీరోయిన్ నివేదా పేతురాజ్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నది. ఇప్పటికే తెలుగులో విభిన్నపాత్రలు, విలక్షణమైన నటనతో ఆకట్టుకొన్న ఆమెకు హిందీ సినిమా నుంచి భారీ ఆఫర్ లభించింది. ప్రస్తుతం యువ హీరో విశ్వక్ సేన్‌తో కలిసి దాస్ కా ధమ్కీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మార్చి 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా విమర్శల నుంచే కాకుండా ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు అందుకొంటున్నది. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా నివేదా పేతురాజ్ తెలుగు ఫిల్మీబీట్‌తో మాట్లాడుతూ..
నాకు యాక్టింగ్‌పై పూర్తిగా ఆధారపడి ఉండటం ఇష్టం లేదు. చెన్నైలో బిజినెస్‌లు ప్రారంభిస్తున్నాను. దుబాయ్ నుంచి నా పేరేంట్స్ చెన్నైకి షిప్ట్ అవుతున్నారు. మరో ఆరు నెలలుగా రెస్టారెంట్, ఫ్లవర్ బిజినెస్ ప్రారంభిస్తున్నాను. ఆ పనుల్లో బిజీగా ఉన్నాను. అందుకే ఎక్కువగా సినిమాలు ఓకే చేయడం లేదు అని నివేదా పేతురాజ్ చెప్పారు.

సినిమాల కంటే ఓటీటీల నుంచి మంచి ఆఫర్లు వస్తున్నాయి. కానీ వాటిని కూడా ఆచితూచీ సినిమాలు చేస్తున్నాను. ఇప్పుడు సినిమా థియేటర్లలో రిలీజ్ అయితే గానీ.. ఓటీటీలో రిలీజ్ కావడం లేదు. అందుకే మంచి సినిమాలను ఎంచుకొంటున్నాను అని నివేదా పేతురాజ్ చెప్పారు.
ప్రస్తుతం బాలీవుడ్‌లో టీ సిరీస్ నుంచి మంచి ఆఫర్ వచ్చింది. ఆ సినిమా కోసం పనిచేస్తున్నాను. ఆ సినిమాకు ఇంకా టైటిల్ పెట్టలేదు. ఆ సినిమాకు బిజయ్ నంబియార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇతర వివరాలు త్వరలోనే వెల్లడిస్తారు అని నివేదా పేతురాజ్ తెలిపారు.
ప్రస్తుతం ముంబైలో నేను ఇల్లు కొనుక్కొన్నాను. త్వరలోనే ముంబైకి షిప్ట్ అవుతాను. హైదరాబాద్‌లో ఇల్లు కొనాలని అనుకొన్నాను. కానీ కుదర్లేదు. ముంబైలో ఇంటిని కొన్నాను అని నివేదా పేతురాజ్ చెప్పారు.
నివేదా పేతురాజ్ కెరీర్ విషయానికి వస్తే.. 2022లో బ్లడీ మేరీ, విరాటపర్వం, దాస్ కా ధమ్కీ చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం హిందీ సినిమాతోపాటు పార్టీ అనే చిత్రంలో నటిస్తున్నారు. త్వరలోనే ఈ రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.


Click it and Unblock the Notifications











