twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సెక్సువల్ హరాస్మెంట్: ‘మెంటల్ మదిలో’ హీరోయిన్ కూడా బాధితురాలే...

    By Bojja Kumar
    |

    Recommended Video

    సెక్సువల్ హరాస్మెంట్: ‘మెంటల్ మదిలో’ హీరోయిన్ కూడా బాధితురాలే...

    లైంగిక వేధింపులు, అఘాయిత్యాలు....తరచూ దేశంలో ఎక్కడో ఒక చోట ఇలాంటి దారుణాలు మహిళలపై చోటు చేసుకుంటూనే ఉన్నాయి. కథువా, ఉన్నావ్ రేప్ సంఘటనలు మరోసారి దేశ వ్యాప్తంగా ఇందుకు సంబంధించిన చర్చకు తెరలేపాయి. మరో వైపు టాలీవుల్లో నటీమణులు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులు, కాస్టింగ్ కౌచ్ గురించి కొన్ని రోజులుగా పెద్ద పోరాటమే మొదలైంది.

    ఈ పరిణామాల నేపథ్యంలో మెంటల్ మదిలో సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన తమిళ బ్యూటీ నివేదా పేతురాజ్ తనకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి వెల్లడిస్తూ చేసిన పోస్టు ఇంటర్నెట్లో వైరల్ అయింది.

    ఐదేళ్ల వయసులోనే

    ఐదేళ్ల వయసులోనే

    ప్రతి ఒక్కరూ జీవితంలో ఏదో ఒక సమయంలో లైంగిక వేధింపులు ఎదుర్కొంటూనే ఉన్నారు. నేను కూడా ఐదేళ్ల వయసులో ఇలాంటి వేధింపులు ఎదుర్కొన్నాను.... అంటూ నివేదా పేతురాజ్ తెలిపారు.

     ఇలాంటి నీచానికి పాల్పడేది వారే...

    ఇలాంటి నీచానికి పాల్పడేది వారే...

    చిన్నతనంలో జరిగే ఇలాంటి సంఘటనల గురించి తల్లిదండ్రులకు ఎలా చెప్పాలో కూడా తెలియదు, అసలు ఏం జరుగుతోంది అని అర్థం చేసుకోలేని వయసు. ఇలాంటి నీచానికి పాల్పడే వారిలో చాలా మంది మనకు తెలిసిన వారే ఉంటారు.... అని నివేదా పేర్కొన్నారు.

    తల్లిదండ్రులే చొరవ తీసుకోవాలి

    తల్లిదండ్రులే చొరవ తీసుకోవాలి

    తల్లిదండ్రులకు నేను ఒకే విషయం చెబుతున్నాను. ఇలాంటి విషయాలు వారితో మాట్లాడటం ఇబ్బందికరమే అయినా... వారి మంచి కోసం మాట్లాడక తప్పదు. రెండేళ్ల వయసు నుండే జాగ్రత్తలు నేర్పించడం మంచిది. పిల్లలు ఏ వయసులో ఇలాంటివి ఎదుర్కొంటారో తెలియదు కాబట్టి మనం ముందు జాగ్రత్తగా ఉండటం మంచిది. స్కూలు, ట్యూషన్, ఇంటి బయట ఎక్కడైనా ఇలాంటివి జరుగవచ్చు అని నివేదా చెప్పుకొచ్చారు.

    కూడా అందరినీ చైతన్య పరచండి

    ప్రతిసారీ పోలీసులను ఆశ్రయించడం కుదరక పోవచ్చు. ఈ విషయంలో మగవారి సహకారం కూడా ఉంటే పిల్లల్ని, ఆడవాళ్లని వేధింపుల నుంచి కాపాడుకోగలుగుతాం. ఈ విషయంలో అందరినీ చైతన్యం చేయడం మంచిది అని నివేదా తన వీడియోలో పేర్కొన్నారు.

    English summary
    With nationwide outrage over Unnao and Kathua rape victim controversy, actress Nivetha Pethuraj took to her social media page to reveal that she too was harassed as a child. Mental Madhilo actress revealed in the video that there are many problems in the country. While some issues can be controlled, some cannot be. Women’s safety is an issue that can be addressed.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X