twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అంతా బాగానే ఉంది.. కరోనాపై నివేదా కామెంట్స్

    |

    ప్రస్తుతం సినీ పరిశ్రమలో కరోనా ఎంతటి గందరగోళాన్ని క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. బాలీవుడ్, టాలీవుడ్ అని తేడా లేకుండా అన్ని చోట్లా కరోనా విజృంభిస్తోందో అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా వకీల్ సాబ్‌ను కరోనా భయాందోళనకు గురి చేస్తోంది. వకీల్ సాబ్ యూనిట్‌లో వరుసగా అందరూ కరోనా బారిన పడుతున్నారు. ఐదారు రోజుల క్రితం నివేదా థామస్ కరోనా బారిన పడిన విషయంతెలిసిందే.

    నివేదాకు కరోనా పాజిటివ్ అని తేలడంతో వకీల్ సాబ్ యూనిట్ ఉలిక్కిపడింది. అయితే తాజాగా అంజలికి కూడా పాజిటివ్ అని నిర్దారణ అయిందట. ఈ క్రమంలో చిత్రయూనిట్ అంతా ఖంగారు పడుతోంది. అయితే ప్రస్తుతం నివేదా థామస్ తన ఆరోగ్యం గురించి అప్డేట్ ఇచ్చింది. ఈ క్రమంలో ఓ క్యూట్ ఫోటోను షేర్ చేసింది. ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్న నివేదా తన ఆరోగ్య పరిస్థితిపై క్లారిటీ ఇచ్చింది.

    Nivetha thomas About Corona And Quarantine Time

    ప్రతీ రోజును ఆస్వాధిస్తున్నాను.. అది ఎలా ఉంటే అలా స్వీకరిస్తున్నాను.. అంతా బాగానే ఉంది.. మీ ప్రార్థనలు, మీ ఆశీర్వదాలు.. మీరు చూపించే ప్రేమకు థ్యాంక్స్ అంటూ నివేదా థామస్ ఓ పోస్ట్ చేసింది. ఇంకా బెడ్ మీద నుంచి నివేదా లేచినట్టుగా కనిపించడం లేదు.మొత్తానికి ఈ క్వారంటైన్ సమయాన్ని నివేదా బాగానే ఎంజాయ్ చేస్తోన్నట్టు కనిపిస్తోంది. పాజిటివ్ రావడంతో వకీల్ సాబ్ ప్రమోషన్స్‌కు నివేదా దూరంగా ఉండాల్సి వచ్చింది.

    English summary
    Nivetha thomas About Corona And Quarantine Time..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X