పవన్‌కు ఆ మాట చెప్పడానికి బాధపడ్డాను.. అది నావల్ల కాదని చెప్పా.. నివేదా

జెంటిల్మన్ సినిమా తర్వాత మలయాళీ ముద్దుగుమ్మ నివేదా థామస్‌ అద్భుత అభినయంపై అన్నివర్గాల నుంచి ప్రశంసలు వ్యక్తమయ్యాయి.

By Rajababu

జెంటిల్మన్ సినిమా తర్వాత మలయాళీ ముద్దుగుమ్మ నివేదా థామస్‌ అద్భుత అభినయంపై అన్నివర్గాల నుంచి ప్రశంసలు వ్యక్తమయ్యాయి. తాజాగా నిన్ను కోరి సినిమాలో చూసిన తర్వాత నివేదా వన్ షో వండర్ కాదు అని స్పష్టం చేసింది. నిన్ను కోరి చిత్రంలో నివేదా నటన ముందు నాని కూడా చిన్నపోయిండా అనే ఫీలింగ్‌ను కలిగించింది. ఇటీవల మీడియాతో మాట్లాడుతూ తన సక్సెస్ ఆనందాన్ని పంచుకొన్నది.

నాని సరదాగా ఉంటాడు.. ఇగో కనిపించదు

నాని సరదాగా ఉంటాడు.. ఇగో కనిపించదు

జెంటిల్మన్ సినిమా షూటింగ్ అప్పుడు నాకు టాలీవుడ్ అంతా కొత్త. ప్రస్తుతం చాలా పరిచయాలు ఏర్పడ్డాయి. నిన్ను కోరి సినిమా షూటింగ్‌లో నానితో ఏర్పడిన పరిచయం ఇప్పుడు బలమైన స్నేహంగా మారింది. నాని చాలా సరదాగా ఉంటాడు. స్టార్ అనే ఇగో ఎక్కడా కనిపించదు. తన సహాయం కావాల్సి వస్తే ముందు వెనుక ఆలోచించకుండా చొరవ తీసుకొంటాడు అని నివేదా చెప్పింది.

ఎన్టీఆర్‌తో నటించడం అదృష్టం

ఎన్టీఆర్‌తో నటించడం అదృష్టం

ప్రస్తుతం జూనియర్‌ ఎన్టీఆర్‌ నటిస్తున్న జై లవకుశ చిత్రంలో నటిస్తున్నాను. మూడో చిత్రంతోనే ఎన్టీఆర్ సరసన నటించడం అదృష్టంగా భావిస్తున్నాను. జై లవకుశలో నటించడం ఓ గొప్ప అనుభూతి. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లలో ఒకరిని నటిస్తున్నాను అని నివేదా వెల్లడించింది.

పవన్ కల్యాణ్ ‌ఆఫర్ తిరస్కరించడం

పవన్ కల్యాణ్ ‌ఆఫర్ తిరస్కరించడం

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందించే సినిమాలో పవన్ కల్యాణ్ సరసన నటించే అవకాశం వచ్చింది. కానీ ఆ చిత్రంలో చెల్లెలు పాత్ర. హీరోయిన్‌గా రాణిస్తున్న సమయంలో సిస్టర్ పాత్ర చేయడం వల్ల కెరీర్ ముప్పు ఏర్పడే అవకాశముందనే ఉద్దేశంతో ఆ పాత్రను ఒప్పుకోలేదు. ఆ మాటను చెప్పడానికి చాలా బాధపడ్డాను. పవన్‌తో సినిమా వదులుకోవడం దురదృష్టమే, మున్ముందు ఆయనతో కలిసి నటించే అవకాశం వస్తే తప్పకుండా చేస్తాను అని నివేదా తెలిపింది.

Recommended Video

Pawan and Trivikram To Follow Attarintiki Daredi Sentiment for Next Movie
హద్దు మీరి ప్రవర్తించను..

హద్దు మీరి ప్రవర్తించను..

నటనపరంగా గ్లామర్‌గా కనిపించడం తప్పనిసరి. అలాగని అవకాశాల కోసం హద్దు మీరను. మితి మీరిన గ్లామర్‌ను ఒలకబోయడం నా వల్ల కాదు. పాత్ర తగినట్టు హుందాగా అనిపిస్తే గ్లామర్ పాత్రల్లో కనిపిస్తాను. నటనపరంగా ఎలాంటి పరిమితులు నాకు లేవు అని ఆమె అన్నారు.

తెలుగులోనే ఎక్కువ గుర్తింపు

తెలుగులోనే ఎక్కువ గుర్తింపు

బాలనటిగానే సినిమాలోకి ప్రవేశించాను. స్టడీస్ పూర్తయిన తర్వాత పూర్తిస్థాయిలో నటనను వృత్తిగా స్వీకరించాను. ప్రస్తుతం తెలుగులో నాలుగు సినిమాలకు ఓకే చెప్పాను. తమిళ, మలయాళం కంటే తెలుగులోనే పాపులర్ కావడం చాలా సంతోషంగా ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X