ఇల్లు అమ్మి.. ఆటో తోలి సినిమా తీశాం.. నిర్మాత అభిరామ్ ఆవేదన
మహాదేవ్ ,మమతా సాహాస్, సునైన నటీనటులుగా తెరకెక్కిన చిత్రం 'నివురు'. ఈ చిత్రం లోగో ఆవిష్కరణ 'మా' అసోసియేషన్ అధ్యక్షులు 'శివాజీరాజా' చేతులు మీదుగా జరిగింది. ఈ కార్యక్రమంలో రైటర్ డైమండ్ రత్నబాబు, ఆర్టిస్ట్ కాశీ విశ్వనాధ్, హీరో మహాదేవ్, ప్రొడ్యూసర్ అభిరామ్, సంగీత దర్శకుడు యం. ఎల్. రాజా తదితరులు పాల్గొన్నారు.
ఈ సదర్భంగా శివాజీరాజా మాట్లాడుతూ.. ''హీరో మహాదేవ్ చిన్నప్పటి నుంచి అందరి హీరోల పేర్లను పచ్చబొట్టు పొడిపించుకున్నాడు. అతనికి సినిమాలంటే అంత పిచ్చి.ఈ సినిమా కెమెరా పరంగా మ్యూజిక్ పరంగా అద్భుతంగా ఉంది. ఈ చిత్రం విజయవంతం అవ్వాలని కోరుకుంటున్నాను.'' అన్నారు.
హీరో మహాదేవ్ మాట్లాడుతూ.. ''నాకు చిన్నప్పటి నుంచి సినిమా తప్ప వేరే ప్రపంచం తెలియదు నాకు. చదువు పెద్దగా అబ్బకపోయినా, సినిమా మీద ఫ్యాషన్ తో ఈ చిత్రాన్ని ఎన్నో కష్టాలకోర్చి, ఆటో నడుపుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించాము.'' అన్నారు.

ప్రొడ్యూసర్ అభిరామ్ మాట్లాడుతూ.. ''మా ఇల్లు అమ్ముకుని, ఆటో తోలుకుంటూ ఈ చిత్రాన్ని తెరకెక్కించాము. ఈ చిత్రం విజయవంతం అయ్యి, మా కష్టానికి తగ్గ ప్రతిఫలం రావాలని కోరుకుంటున్నాను.'' అన్నారు.
ఆర్టిస్టులు: హీరో -మహాదేవ్, హీరోయిన్స్ - మమతా సాహాస్, సునైన
టెక్నీషియన్స్: నిర్మాత - అభిరామ్, డైరెక్టర్ - ఋషికృష్ణ, సంగీతం - యమ్. యల్. రాజా, కెమెరా - గురు, ఎడిటింగ్ - సత్తాజ్, లిరిక్స్ - ఋషికృష్ణ, అభి ఉప్పల, ఆడియో - జివికె4 మ్యూజిక్.


Click it and Unblock the Notifications











