twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సినిమా ప్లాప్ అయింది: అప్పులై పాలైన హీరో....దొంగతనాలు, చివరకు కటకటాల్లోకి!

    By Bojja Kumar
    |

    Recommended Video

    అప్పులు తీర్చడానికి దొంగగా మారిన హీరో...!

    సినిమాల మీద పిచ్చితో అప్పులు చేసిన మరీ సినిమా తీశాడు. కానీ అది కాస్త నష్టాలు మిగల్చడంతో అప్పుల నుండి బయటపడటానికి దొంగతనాలను ఎంచుకున్నాడు. హబ్సిగూడ ప్రాంతంలో దొంగతనాలు చేయడానికి రెక్కీ నిర్వహిస్తుండగా పోలీసులకు పట్టుబడ్డారు. వారి వద్ద నుండి భారీ ఎత్తున బంగారం, వెండి, నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు 'నివురు' అనే సినిమాలో హీరోగా నటించడం, ఆ సినిమా కారణంగానే దొంగతనాల వైపు మళ్లడం చర్చనీయాంశం అయింది.

    ‘నివురు' మూవీలో హీరోగా

    ‘నివురు' మూవీలో హీరోగా

    కుషాయిగూడ జమ్మిగడ్డ ప్రాంతానికి చెందిన మహేష్‌ సినిమా పిచ్చితో ‘నివురు' సినిమాను సొంత డబ్బులతో నిర్మించి తనే హీరోగా నటించాడు. ఈ మూవీ వల్ల నష్టాలు మిగలడంతో అప్పులు తీర్చడానికి దొంగతనాలను ఎంచుకున్నట్లు పోలీసులకు తెలిపాడు.

    చిన్నతనం నుండి సినిమా పిచ్చితో

    చిన్నతనం నుండి సినిమా పిచ్చితో

    నాకు చిన్నప్పటి నుంచి సినిమా తప్ప వేరే ప్రపంచం తెలియదు నాకు. చదువు పెద్దగా అబ్బకపోయినా, సినిమా మీద ఫ్యాషన్ తో ఈ చిత్రాన్ని ఎన్నో కష్టాలకోర్చి, ఆటో నడుపుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించాము. అది నష్టాలు మిగల్చడంతో దొంగతనాలకు పాల్పడ్డట్లు నిందితుడు పోలీసులకు తెలిపినట్లు సమాచారం.

    తన స్నేహితుడితో కలిసి

    తన స్నేహితుడితో కలిసి

    అప్పులు తీర్చడానికి, తన జల్సాల కోసం విక్కితో కలిసి గత కొంతకాలంగా దొంగతనాలు పాల్పడుతున్నాడు. విక్కీ 2016లో జూబ్లీహిల్స్‌ పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లాడు. జైలు నుంచి విడుదలైన తరువాత కూడా చోరీలకు పాల్పడుతున్నాడు. అప్పులు తీర్చడానికి, తన జల్సాల కోసం విక్కీతో మహేష్ చేతులు కలిపాడు.

     నేరం నేరమే..

    నేరం నేరమే..

    సినిమాల వల్ల తాను నష్టపోయానని... ఇతరులకు నష్టం కలిగించేలా దొంగతనాలకు పాల్పడ్డ సినీ హీరో చర్యను పలువురు తప్పుబడుతున్నారు. సినిమా చేసి నష్టపోయి దొంగతనాలకు పాల్పడ్డామంటే ఎవరూ సానుభూతి చూపరనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

    English summary
    Nivuru movie hero arrested. Nivuru is a Telugu movie starring Maha Dev and Mamatha in prominent roles. It is a drama directed by Rushi Krishna.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X