Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
సినిమా ప్లాప్ అయింది: అప్పులై పాలైన హీరో....దొంగతనాలు, చివరకు కటకటాల్లోకి!
Recommended Video
సినిమాల మీద పిచ్చితో అప్పులు చేసిన మరీ సినిమా తీశాడు. కానీ అది కాస్త నష్టాలు మిగల్చడంతో అప్పుల నుండి బయటపడటానికి దొంగతనాలను ఎంచుకున్నాడు. హబ్సిగూడ ప్రాంతంలో దొంగతనాలు చేయడానికి రెక్కీ నిర్వహిస్తుండగా పోలీసులకు పట్టుబడ్డారు. వారి వద్ద నుండి భారీ ఎత్తున బంగారం, వెండి, నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు 'నివురు' అనే సినిమాలో హీరోగా నటించడం, ఆ సినిమా కారణంగానే దొంగతనాల వైపు మళ్లడం చర్చనీయాంశం అయింది.
‘నివురు' మూవీలో హీరోగా
కుషాయిగూడ జమ్మిగడ్డ ప్రాంతానికి చెందిన మహేష్ సినిమా పిచ్చితో ‘నివురు' సినిమాను సొంత డబ్బులతో నిర్మించి తనే హీరోగా నటించాడు. ఈ మూవీ వల్ల నష్టాలు మిగలడంతో అప్పులు తీర్చడానికి దొంగతనాలను ఎంచుకున్నట్లు పోలీసులకు తెలిపాడు.
చిన్నతనం నుండి సినిమా పిచ్చితో
నాకు చిన్నప్పటి నుంచి సినిమా తప్ప వేరే ప్రపంచం తెలియదు నాకు. చదువు పెద్దగా అబ్బకపోయినా, సినిమా మీద ఫ్యాషన్ తో ఈ చిత్రాన్ని ఎన్నో కష్టాలకోర్చి, ఆటో నడుపుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించాము. అది నష్టాలు మిగల్చడంతో దొంగతనాలకు పాల్పడ్డట్లు నిందితుడు పోలీసులకు తెలిపినట్లు సమాచారం.
తన స్నేహితుడితో కలిసి
అప్పులు తీర్చడానికి, తన జల్సాల కోసం విక్కితో కలిసి గత కొంతకాలంగా దొంగతనాలు పాల్పడుతున్నాడు. విక్కీ 2016లో జూబ్లీహిల్స్ పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లాడు. జైలు నుంచి విడుదలైన తరువాత కూడా చోరీలకు పాల్పడుతున్నాడు. అప్పులు తీర్చడానికి, తన జల్సాల కోసం విక్కీతో మహేష్ చేతులు కలిపాడు.
నేరం నేరమే..
సినిమాల వల్ల తాను నష్టపోయానని... ఇతరులకు నష్టం కలిగించేలా దొంగతనాలకు పాల్పడ్డ సినీ హీరో చర్యను పలువురు తప్పుబడుతున్నారు. సినిమా చేసి నష్టపోయి దొంగతనాలకు పాల్పడ్డామంటే ఎవరూ సానుభూతి చూపరనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.