ఆర్యలోనే కాపీ కొట్టాను
మీరు గమనించ వచ్చు అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన ఆర్య చిత్రంలో మైఖల్ జాక్సన్ స్టైల్ ని నేను కాపీ కొట్టడం..అంటున్నారు ప్రముఖ కొరియోగ్రాఫర్ నిక్సన్. మైఖల్ జాక్సన్ మరణవార్త పై స్పందిస్తూ నిక్సిన్ పై విధంగా చెప్పుకొచ్చారు. మైఖల్ మరణ వార్త విని తాను టోటల్ గా బ్లాంక్ అయ్యానన్నారు. అలాగే మైఖల్ మూవిమెంట్స్ ఎవర్ గ్రీన్ అని, యూనిక్ గా ఉంటాయని, అభిమానులు ఎప్పుడూ బోర్ ఫీల్ కాలేదని చెప్పుకొచ్చారు. మనం ఆయన ఉండే దేశంలో లేము కానీ ఆయన వీడియోస్ ని అందరం చూస్తూనే ఉన్నాం. కొన్ని మిలియన్ల మందికి ఆయన ఆరాధ్య దైవం అంటూ ఎమోషన్ అయ్యారు. నిక్సిన్ బాబి, సై, వర్షం, ఆర్య, బొమ్మరిల్లు, కొంచెం ఇష్టం కొంచెం కష్టం, చింతకాయల రవి, నచ్చావులే వంటి ఎన్నో హిట్ చిత్రాలకు కొరియోగ్రఫి అందించారు. తన క్రియోషన్ కి ప్రేరణ మైఖల్ స్టెప్స్ అని ఆయన లేకపోవటం తనను బాధకు గురిచేస్తోందంటున్నారు.


Click it and Unblock the Notifications











