twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నువ్వు.. నేను.. ప్రేమ.. కథ

    By Staff
    |

    తెలుగు ప్రేక్షకులు తాజాగా బ్రహ్మరథం పట్టిన తమిళ హీరో సూర్య. జ్యోతిక జీవితంలో రియల్‌ హీరో కూడా అయిన సూర్య వాళ్లిద్దరి పెళ్లికి ముందు నటించిన చిత్రం జిల్లే ఒరు కాదిల్‌.. ఇప్పుడు ఆ తమిళ చిత్రమే తెలుగులో నువ్వు.. నేను.. ప్రేమ.. టైటిల్‌తో ఈనెలాఖరులో విడుదలవుతోంది.

    తెలుగులో ఈ చిత్రాన్ని సూర్య సొంతంగా విడుదల చేస్తుండటం విశేషం. స్టూడియో గ్రీన్‌ పతాకంపై విడుదల చేస్తున్న ఈ డబ్బింగ్‌ చిత్రం సక్సెస్‌పై సూర్య చాలా అంచనాలతో ఉన్నారు. గజనీ తర్వాత విడుదలవుతున్న ఈ చిత్రం కచ్చితంగా మంచి ఓపెనింగ్స్‌ సాధించే అవకాశాలు ఉన్నాయని, ప్రేక్షకుల అంచనాలను ఈ చిత్రం ఏమాత్రం నిరాశపర్చదని సూర్య అభిప్రాయపడుతున్నారు.

    నువ్వు.. నేను.. ప్రేమ.. ఒక ట్రయాంగిల్‌ లవ్‌ స్టోరీ. కథ గురించి చెప్పాలంటే.. సూర్య, జ్యోతిక కొత్తగా పెళ్లయిన దంపతులు. చాలా అన్యోన్య దాంపత్యం. (వారిద్దరి మధ్య సన్నివేశాలను దర్శకుడు కృష్ణ చాలా రియలిస్టిక్‌గా చిత్రీకరించారని ఇప్పటికే చాలా ప్రశంసలు వచ్చాయి) సూర్య తప్ప తన జీవితంలో మరేమీ లేదన్న అభిప్రాయంలో ఉన్న జ్యోతిక ఒకరోజు సూర్య డైరీ చదవడం తటస్థిస్తుంది. దాని ద్వారా సూర్యకు గతంలో కాలేజీ రోజుల్లో మరో ప్రేమ వ్యవహారం ఉందని, ఆమెను సూర్య ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడని కూడా ఆ డైరీ ద్వారా తెలుసుకుని జ్యోతిక షాకవుతుంది. అక్కడి నుంచి ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళితే.. సూర్య, భూమిక మధ్య కాలేజీ నేపథ్యంలో కొంత కథ నడుస్తుంది. తన భర్త హృదయంలో తనకు మాత్రమే స్థానం ఉందనుకున్న జ్యోతిక అదంతా వట్టిదేనని, మరో అమ్మాయి కూడా ఉందని తెలుసుకున్న తర్వాత ఆ దంపతుల మధ్య తలెత్తే పరిణామాలు ఏమిటి? భూమిక పాత్ర ఏ విధంగా ఉంటుంది? వంటి ప్రశ్నలకు సమాధానం కావాలంటే.. ఈ చిత్రం చూడాల్సిందే..

    ఇందులో సూర్య, జ్యోతిక ఆలుమగలుగా నటించిన సన్నివేశాలు అద్భుతంగా పండాయని, అలాగే కాలేజీ రోజుల్లో స్టూడెంట్‌గా సూర్య, భూమిక మధ్య రొమాన్స్‌ చాలా అందంగా డైనమిక్‌గా ఉంటుందని నిర్మాతలు చెబుతున్నారు. అన్నింటికీ మించి ఎ.ఆర్‌. రెహ్మాన్‌ అందించిన సంగీతం ఈ చిత్రానికి హైలెట్‌గా నిలుస్తుందని చెబుతున్నారు.

    నువ్వు.. నేను.. ప్రేమ.. చిత్రం ఈనెలాఖరులో విడుదలవుతుంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X