నెం.1 స్థానంలో రామ్ చరణ్ ‘నాయక్’

By Bojja Kumar

హైదరాబాద్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'నాయక్' చిత్రం వసూళ్ల పరంగా, లాభాలపరంగా ఈ సంవత్సరం తొలి త్రైమాసికంలో విడుదలైన సినిమాల్లో నెం.1 స్థానం దక్కించుకుంది. రెండో స్థానంలో మహేష్ బాబు-వెంకీ మల్టీ స్టారర్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, మూడో స్థానంలో ప్రభాస్ మిర్చి చిత్రాలు నిలిచాయి. ఇండో ఏషియన్ వార్తా సంస్థ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడింది. తొలి త్రైమాసికంలో ఇప్పటి వరకు విడులైన చిత్రాల్లో నాయక్ తో పాటు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, మిర్చి, స్వామి రారా చిత్రాలు మాత్రమే హిట్ అయి పెట్టుబడిని మించిన వసూళ్లు రాబట్టి నిర్మాతలకు లాభాలు తెచ్చి పెట్టాయి అని సదరు వార్తా సంస్థ తేల్చింది.

రామ్ చరణ్ హీరోగా వివి వినాయక్ దర్శకత్వంలో రూపొందిన 'నాయక్' చిత్రం రూ. 35 కోట్ల బడ్జెట్‌తో నిర్మాణమై రూ. 60 కోట్ల షేర్ వసూలు చేసినట్లు వెల్లడించింది. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కాజల్ హీరోయిన్ గా చేసింది. డివివి దానయ్య నిర్మించగా, తమన్ సంగీతం అందించారు.

మహేష్ బాబు, వెంకటేష్ మల్టీ స్టారర్ గా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందిన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం రూ. 50 కోట్ల షేర్ సాధించినట్లు నిర్మాత దిల్ రాజు వెల్లడించారు. ఈ చిత్రం దాదాపు రూ. 45 కోట్లతో నిర్మించారు. ఈచిత్రంలో వెంకటేష్ సరసన అంజలి, మహేష్ బాబు సరసన సమంత నటించారు. మిక్కీ జే మేయర్ సంగీతం సమకూర్చారు.

ఇక ప్రభాస్ హీరోగా రూపొందిన 'మిర్చి ' చిత్రం రూ. 30 కోట్ల బడ్జెట్ తో రూపొంది రూ. 45 కోట్ల షేర్ సాధించింది. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించారు. యువి క్రియేషన్స్ బేనర్ పై వి.వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి ఈచిత్రాన్ని నిర్మించారు. ప్రభాస్ సరసన అనుష్క, రీచా గంగోపాధ్యాయ్ నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X