twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'ఇద్దరమ్మాయిలతో' లో అమలా పాల్ ఆ సీన్ తీసేసారా?

    By Srikanya
    |

    హైదరాబాద్ : శుక్రవారం విడుదల అయిన అల్లు అర్జున్ చిత్రం 'ఇద్దరమ్మాయిలతో' . మార్నింగ్ షోకే డివైడ్ టాక్ తెచ్చుకుంది. ఇక ఈ చిత్రం ప్రారంభం అయిన కొత్తలో అమలా పాల్ ఈ చిత్రంలో నింజా టైప్ ఫైట్ చేసిందని ప్రచారం జరిగింది. అలాంటి స్టిల్ ఒకటి ఆమె తన ట్విట్టర్ ఎక్కౌంట్ లో పోస్ట్ చేసింది. దాంతో ఆమె ఫ్యాన్స్ చాలా ఎక్సపెక్ట్ చేసారు. అయితే సినిమాలో అలాంటిదేమీ లేదు.

    అయితే ఈ సీన్ తీసారని, అయితే ఎడిటింగ్ లో ఆ సీన్ ని తొలిగించారని మరో ప్రచారం జరుగుతోంది. ఈ విషయమై అమలా పాల్ మాత్రం ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా ఉండిపోయింది. ఆమె కత్తి పట్టుకున్న ఫోజ్ మాత్రం అంతటా ప్రచారమై సినిమాకు మాత్రం క్రేజ్ తెచ్చిందనటంలో సందేహంలో లేదు.

    ఇక సినిమాకు నెగిటివ్ టాక్ రావటంతో ... చిత్రంలో సీన్స్ కోత మొదలైంది. మొదటిగా ఈ కోత బ్రహ్మానందం, అలీ సీన్స్ పై పడింది. అలీ,బ్రహ్మానందం మధ్య వచ్చే కామెడీ సీన్స్ కు పూరీ జగన్నాధ్ సినిమాలు మొదటి నుంచి పెట్టింది పేరు. పోకిరి,సూపర్,చిరుత,కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తాయి.

    అయితే తాజాగా వచ్చిన 'ఇద్దరమ్మాయిలతో' ఆ సీన్స్ అసలు పండలేదు. అన్ని చోట్ల నుంచి ఈ సీన్స్ చెత్తాయని టాక్ వచ్చింది. దాంతో రియలైజ్ అయిన టీమ్ వెంటనే ఆ సీన్స్ పై కోత వేసారు. సెకండాఫ్ లో వచ్చే బ్రహ్మి,అలీ ట్రాక్ పూర్తిగా ఎత్తివేసారు. ఉన్నంతంలో కాస్త బోర్ తగ్గి సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందని భావిస్తున్నారు.

    English summary
    Rumor was spread allover saying that Amala Paul will do
 some Daredevil Fight Sequences added with Ninja Fights. She even posted a pic
 holding a sword and posed as if she was fighting with Ninja Fighters. Fans
 expected a lot about this scene but were disappointed totally with its
 absence. So, here raised a doubt behind deleting this scene from the
 movie by the Director.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X