విశాల్ తో ఎఫైర్ గురించి త్రిష

ఇక నిన్న ఓ శారీ షోరూమ్ ఓపినింగ్ కి విజయవాడకి ఛార్టెడ్ ఫ్లైట్ లో వచ్చిన త్రిష ని అక్కడి లోకల్ మీడియా కలిస్తే..కొన్ని ఆసక్తి కరమైన విషయాలు వివరించింది. త్వరంలో దిల్ రాజు డబ్బింగ్ చేయబోతున్న ఆకాశమంతా తమిళంలో 'Abhiyum Naanum' పేరుతో క్రితం వారం రిలీజై మంచి ఓపినింగ్స్ సంపాదించిందని చెప్పింది. అయితే ట్విస్ట్ ఏమిటంటే ఆ సినిమా అక్కడ వర్కవుట్ కాలేదు.అంతేకాక తను హీరోయిన్ గా బుక్కయిన మర్మయోగి ఆగటం మేలేనని చెప్తోంది.
కారణంగా అంత బడ్జెట్ ఉన్న సినిమాలు ప్రారంభం మయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో వర్కువుట్ అవటం కష్టమని చెప్తోంది. అయితే హీరో,హీరోయిన్స్ మొదట అనుకున్న రెమ్యునేషన్స్ తగ్గించుకుంటే మర్మయోగి ప్రారంభించటం కష్టం కాదని ఆ నిర్మాతలు కమల్ తో సూచించిన సంగతి ఇక్కడ గుర్తు చేసుకోవాలి. అలా మీడియా వారు అడిగిన ప్రశ్నలన్నిటికీ త్రిష తనకు తోచిన రీతిలో సమాధానాలిచ్చింది.


Click it and Unblock the Notifications











