తెలుగు హీరోయిన్ తో ఎఫైరే దర్శన్ కాపురం కూల్చిందా

By Srikanya

సంబరం, కళ్యాణ రాముడు, మహా రాజశ్రీ వంటి చిత్రాల్లో నటించిన నిఖిత ఇప్పుడు ఓ కొత్త తల నొప్పిలో ఇరుక్కుంది. కన్నడ హీరో దర్శన్ తో ఆమెకు ఎఫైర్ ఉందంటూ ఆమెపై ఆరోపణలు వస్తున్నాయి. అందుకే దర్శన్ ఆమెకోసం తన భార్యను విడిచి పెట్టాడని కన్నడ చిత్ర సీమలో వార్తలు వినపడునతున్నాయి. అక్కడ మీడియా దీన్ని హైలెట్ చేస్తోంది. ఈ నేపద్యంలో నిఖిత తనకు ఆ హీరోతో ఎఫైర్ లేదని మీడియా వద్ద వాపోయింది. అలాగే తనకు ఆ మొగడు, పెళ్ళాలు ఎందుకు కొట్టుకున్నారో, విడిపోయారో తెలియదు అంది. అలాగే తనకూ దర్శన్ కీ మధ్య రిలేషన్ కేవలం ...షూటింగ్ వరకే పరిమితం అంది. ఇక భార్యను చితకబాదిన కేసులో ప్రముఖ కన్నడ నటుడు దర్శన్ అరెస్టయ్యన సంగతి తెలిసిందే. భార్య విజయలక్ష్మి ఫిర్యాదు మేరకు బెంగుళూర్ విజయనగర పోలీసులు ఆయనను అరెస్టు చేశారు.

శుక్రవారం తెల్లవారు జామున దర్శన్ విజయలక్ష్మిని చితకబాదినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. విజయలక్ష్మిని దర్శన్ చంపేస్తానంటూ తుపాకితో బెదిరించినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. తీవ్రంగా గాయపడిన విజయలక్ష్మిని గాయత్రీ ఆస్పత్రిలో చేర్చారు. ఆమె తలకు బలమైన గాయం తగిలింది. ఐసియులో ఆమె చికిత్స పొందుతోంది. దర్శన్‌కు కన్నడ సినీ రంగంలో మంచి పేరుంది. మంచి నటుడిగా కూడా గుర్తింపు పొందాడు. దాదాపు 44 సినిమాల్లో నటించాడు. క్యారెక్టర్ యాక్టర్‌గా, విలన్‌గా అతను నటించాడు. పెళ్లయిన కొత్తలో భార్యాభర్తలు బాగానే ఉండేవారని, గత ఏడాది కాలంగా కలతలు చోటు చేసుకున్నాయని అంటున్నారు. వారికి ఓ పాప కూడా ఉంది. కలతల కారణంగా విజయలక్ష్మి ఎక్కువగా తన తల్లిదండ్రులతోనే ఉంటోందని చెబుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X