షాకింగ్ న్యూస్-ఆడియో వేడుకకు నో చెప్పిన పవన్

By Bojja Kumar

హైదరాబాద్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు షాకింగ్ న్యూస్. పవన్ తాజాగా నటిస్తున్న 'కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రం ఆడియో వేడుక కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్న వారందరికీ ఇది చేదు వార్తే. ఎందుకంటే ఆడియో వేడుక రద్దయింది. ఎలాంటి వేడుక నిర్వహించకుండానే నేరుగా ఆడియోను ఈ నెల 24న మార్కెట్లోకి విడుదల చేయనున్నారని తెలుస్తోంది.

హీరో పవన్ కళ్యాణ్ ఆడియో వేడుక నిర్వహించడానికి విముఖత చూపడం వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం అవుతోంది. అయితే పవర్ స్టార్ ఈ నిర్ణయం తీసుకోవడం వెనక బలమైన కారణం ఉందని, అభిమానులు ఇబ్బంది పడకూడదనే ఒక మంచి ఉద్దేశ్యంతోనే పవర్ స్టార్ ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు.

పవన్ కళ్యాణ్‌‍కి ఏ రేంజిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో కొత్తగా చెప్పక్కర్లేదు. ఆయనకు సంబంధించిన ఏ వేడుక జరిగిన తండోపతండాలుగా అభిమానులు తరలి వస్తుంటారు. పంజా, గబ్బర్ సింగ్ ఆడియో వేడుకల సందర్భంగా భారీగా అభిమానులు తరలి రావడంతో చోటు సరిపోక చాలా మంది బయటే ఉండి పోయారు. క్రౌడ్‌ను కంట్రోల్ చేయడానికి పోలీసులు లాఠీ చార్జ్ చేయడంతో పలువురు అభిమానులు గాయపడ్డారు. ట్రాఫిక్ జామ్‌తో అనేక మంది ఇబ్బంది పడ్డారు.

ఇలాంటి ఘటనలు మళ్లీ చోటు చేసుకూడదని, తన వల్ల, తన సినిమా వల్ల ఇంత మంది ఇబ్బంది పడటం ఇష్టం లేకనే పవన్ కళ్యాణ్ ఆడియో వేడుకకు నో చెప్పినట్లు తెలస్తోంది. పాటలు, సినిమా బాగుంటే హిట్టవుతుంది...అడియో వేడుకలు నిర్వహించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని పవర్ స్టార్ భావిస్తున్నారట.

పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న 'కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రంలో పవన్ సరసన తమన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ఈచిత్రంలో పవర్ స్టార్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుగా కనిపించనున్నారు. ఈ చిత్రానికి ఫోటో గ్రఫీ: శ్యామ్ కె. నాయుడు, ప్రొడక్షన్ డిజైనర్: చిన్నా, ఎడిటింగ్: ఎస్.ఆర్, శేఖర్, ఫైట్స్: విజయ్, స్టిల్స్: మాగంటి సాయి, కో డైరెక్టర్: విజయరామ్ ప్రసాద్, నిర్మాణం యూనివర్సల్ మీడియా, సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ, నిర్మాత: డివివి దానయ్య, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: పూరి జగన్నాథ్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X