ఆడియో వేడుక లేకుండానే నాగ్‘రాజన్న’ పాటలు
అక్కినేని నాగార్జున నటిస్తున్న తాజా సినిమా 'రాజన్న" సినిమాకు ఆడియో వేడుక నిర్వహించకూడదని దర్శక నిర్మాతలు నిర్ణయించారు. ఎలాంటి వేడుక లేకుండానే ఈ సినిమా పాటలు నవంబర్ 26 నుంచి మార్కెట్ లోకి విడుదల కానున్నాయి. కీరవాణి సంగీతం అందించిన ఈ సినిమా హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కింది. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమా దర్వకత్వం వహించారు. ఈ సినిమాలోని కొన్ని యాక్షన్ సన్నివేశాలకు స్వయంగా రాజమౌళి దర్వకత్వం వహించారు. నాగార్జున ఇందులో పవర్ ఫుల్ క్యారెక్టర్లో కనిపించబోతున్నారు. నిజాం పాలనకు, రజకార్ల ఆగడాలను వ్యతిరేకంగా సాగిన అంశాలు ఈ సినిమాలో ఉంటాయని సమాచారం.
రాజన్న సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తియింది. ప్రస్తుతం ఈ సినిమా పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. డిసెంబర్ 23న భారీ ఎత్తున రాజన్న సినిమాను విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. మాస్ పీపుల్ ను ఆకట్టుకునే కథాంశంతో ఉన్న ఈ సినిమా తన కెరీర్లోనే ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందని నాగార్జున ఆశిస్తున్నాడు. ప్రస్తుతం నాగార్జున ఢమరుకం షూటింగులో బిజీగా ఉన్నారు.


Click it and Unblock the Notifications











