twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జెనీలియాపై బ్యాన్ పై మురళి మోహన్

    By Srikanya
    |

    జెనీలియాపై బ్యాన్ పెట్టనున్నారంటూ మంగళవారం మీడియాలో జరగుతున్న ప్రచారాన్ని 'మా" అధ్యక్షుడు మురళీమోహన్ ఖండించారు. ఇది వాస్తవం కాదని ఆయన అన్నారు. అలాగే ఆయన ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో మీడియాతో మాట్లాడుతూ.. జెనీలియాపై బ్యాన్ లాంటిది ఏమీ తెలుగు పరిశ్రమ పెట్టాలనుకోవటం లేదని అన్నారు. అయితే 'మా" సంస్థ ప్రతినిధులు జెనీలియాను సంప్రదించి, సభ్యత్వం తీసుకోవల్సిందిగా కోరినప్పుడు ఆమె అందుకు విభేదించినట్లు తెలుస్తోంది. 'మా" సభ్యత్వం తీసుకోవాలంటే లక్ష రూపాయలు చెల్లించవలసి ఉంటుంది. అందుకు ఆమె అభ్యంతరం చెబుతూ, ''నేను కట్టను. మీకిష్టం అయితే నన్ను సభ్యురాలుగా చేర్చుకోండి. లేదంటే లేదు"" అని చాలా స్పష్టంగా చెప్పినట్లు తెలుస్తోంది.

    జెనీలియా వైఖరితో 'మా"డైలమాలో పడింది. ఎందుకంటే జెనీలియా మీద వేటు వేస్తే ఆమె చేస్తున్న 'నా ఇష్టం" సినిమా ఆగిపోతుంది. అక్కడ నుంచి ఆ నిర్మాత, హీరో రానా(సురేష్ బాబు కుమారుడు) వైపు నుంచి ప్రెసర్ వస్తుంది. దాంతో వారు వాస్తవానికి డిసెంబరు 1 వరకు సభ్యులు కావడానికి నిర్ణీత సమయంగా 'మా" సంస్థ వెసులుబాటు ఇచ్చి సమస్యను పరిష్కరించాలని చూసారు. ఒక సినిమాలో నటించినందుకు 90 లక్షల వరకూ డిమాండ్ చేస్తున్న జెనీలియా... తాను నటిగా ఎదగడానికి అంతగా దోహదం చేసిన తెలుగు ఆర్టిస్టుల సంఘంలో ఒక లక్ష ఫీజు కట్టి సభ్యత్వం తీసుకోకపోవడం ఇప్పుడు అంతటా చర్చనీయాంశమైంది. అయితే ఆరెంజ్ సమయంలో తనపై ఎన్నో ఆరోపణలు వచ్చినా ఇండస్ట్రీలో ఎవరూ సపోర్టు ఇవ్వకపోవటంతో ఆమె ఈ తరహాలో బిహేవ్ చేస్తోందని కొందరు అంటున్నారు.

    English summary
    Reacting to reports in some media that Movie Artists Association (MAA) has banned Genelia, Murali Mohan stated that there has been no such move by MAA. He stated while talking to the media at his office in Film Chamber of Commerce.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X