బ్యాన్ పై జెనీలియా ఘాటు స్పందన
జెనీలియాపై 'మా" బ్యాన్ పెట్టనున్నారంటూ మంగళవారం నుంచి మీడియాలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.అయితే ఈ నేపధ్యంలో ఆమె ట్విట్టర్ లో ఈ విషయమై స్పందిస్తూ...నన్నే టార్గెట్ చేస్తూ మీడియా లో వార్తలు చేయటం పద్దతి కాదు.నా మీద ఏ బ్యాన్ లు,నోటీసులు ఇప్పటివరకూ ఇష్యూ కాలేదు.ఎందుకిలా నా మీద వ్యతిరేక ప్రచారం జరుగుతోందో అర్దం కావటం లేదు.నేను గత నాలుగు నెలలుగా ఖాళీ లేనంత బిజీగా ఉన్నాను.షూటింగ్ లు లేకపోతే ప్రయాణాలు అన్నట్లుంది నా పరిస్ధితి.నేను నా ప్రొడక్షన్ వారికి ఆ డబ్బులు,పేపర్లు మా కి అందచేయమని చెప్పటం జరిగింది.అలాగే సౌత్ ఇండియన్ అశోశియేషన్ లో నేను సభ్యత్వం తీసుకునేటప్పుడు నాలుగు భాషల్లో సభ్యత్వం తీసుకున్నట్లే అని చెప్పారు.అయితే ఇప్పుడు మళ్లీ ఇక్కడ కూడా సభ్యత్వం తీసుకోమంటున్నారు.ఇక నేను నాలుగు భాషలకు చెందిన నటిని అయినందుకు చాలా ఆనందంగా ఉంది.ఇకనుంచి అయినా నిజాలు తెలిసుకుని మీడియా నాపై దుష్పచారం ఆపుతుందని భావిస్తున్నాను అంది.మరో ప్రక్క జెనీలియాపై బ్యాన్ విషయాన్ని 'మా" అధ్యక్షుడు మురళీమోహన్ సైతం ఖండించారు.ఇది వాస్తవం కాదని ఆయన అన్నారు. అలాగే ఆయన ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో మీడియాతో మాట్లాడుతూ.. జెనీలియాపై బ్యాన్ లాంటిది ఏమీ తెలుగు పరిశ్రమ పెట్టాలనుకోవటం లేదని అన్నారు. అయితే 'మా" సంస్థ ప్రతినిధులు జెనీలియాను సంప్రదించి, సభ్యత్వం తీసుకోవల్సిందిగా కోరినప్పుడు ఆమె అందుకు విభేదించినట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











