వివాదాల పుట్ట: టైటిల్ లేకుండానే చిత్రం విడుదల(ఫొటోలు)
బెంగళూరు : కన్నడ చిత్ర పరిశ్రమలో పేరులేని సినిమా విడుదలకు సిద్ధమైంది. అడ్డంగా విభూది రేఖలు- మధ్యలో తిలకం.. ఈ చిహ్నంతో ఈ సినిమా రూపొందింది. బసవణ్ణ పేరును తొలుత ఖరారు చేయగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో బ్రాహ్మణ అనే పేరును ప్రతిపాదించారు. అది కూడా వివాదంగా మారడంతో చివరకు ఎలాంటి పేరులేకుండా కేవలం చిహ్నంతోనే సినిమాను విడుచేయనున్నారు.
నగరంలోని బాలాజీ స్టూడియోలో ఈ సినిమాకు మాటల ధ్వనిముద్రణ పూర్తయింది. ఇతల లాంఛనాల్ని పూర్తి చేసుకుని త్వరలో విడుదల కానుంది. వంద రోజుల పాటు టర్కీ, బ్యాంకాక్, తంజావూరు, చెన్నై, మైసూరు, మేలుకోటె, బెంగళూరు పరిసరాల్లో చిత్రీకరణను పూర్తి చేశారు.
ఉపేంద్ర, రాగిణి, సలోని, శ్రీనివాసమూర్తి, గీతా, దొడ్డణ్ణ, శివరాం, ప్రధాన తారాగణం. మాటలు- గురురాజ్ దేశాయ్, ఫోటోగ్రఫీ- వెంకటేశ ప్రసాద్, సంగీతం- మణిశర్మ, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం- శ్రీనివాసరాజు.
చిత్రం వివాదం విషయం..స్లైడ్ షోలో..

మొదట టైటిల్ వివాదం
మొదట ఈ చిత్రం టైటిల్ 'బసవణ్ణ' వివాదాని దారి తీసింది. ఈచిత్రం 12వ శాతాబ్దానికి చెందిన ఓ సామాజిక సేవకుడి కథ. దీంతో ఈ టైటిల్‌పై 'బసవణ్ణ' కులస్తులు అభ్యంతరం వ్యక్తం చేసారు.

ఫస్ట్ లుక్ వివాదం
టైటిల్ విషయంలో ఓ వివాదంలో ఇరుక్కునప్న ఈచిత్రం తాజాగా ఫస్ట్ లుక్ విషయంలో కూడా అదే పరిస్థితి ఎదుర్కొంది. విడుదలైన ఫస్ట్ లుక్ లో ఉపేంద్ర కత్తి పట్టుకుని ఉండటంతో మరోసారి వివాదం రాజుకుంది.

ప్రచారం
సినిమాలో బసవణ్ణను అభ్యంతరకరంగా చూపించబోతున్నారనే ప్రచారం మొదలైంది. దాంతో బసవణ్ణ అభిమానులంతా మండిపడ్డారు.

మన తెలుగోడే..
కన్నడంలో మూడునాలుగు సినిమాలు తీసినా, ఒక్క సక్సెస్ కూడా పొందని తెలుగు దర్శకుడు శ్రీనివాసరాజు ఈ చిత్రం దర్శకుడు.
5

అది హిట్ అవటంతో ...
వీలైనంత హింస,శృంగారం కలిపి తీసిన ‘దండుపాళ్యం' కన్నడంలో భారీ విజయాన్ని అందుకుంది. తెలుగులో కూడా ప్రేక్షకాదరణ పొందింది. తమిళం, మళయాళంలో డబ్బింగ్ చేస్తే ఘోర పరాజయం పాలయ్యింది. అయితే చాలా వివాదాలు పాలైంది. వివాదమే అందరి దృష్టినీ ఆకర్షించి సక్సెస్ కు దారితీసింది.

అదే రూటులో ..
దాంతో వివాదం అనేది సినిమాకి ఎంతటి పేయింగ్ ఎలిమెంటో తెలుసుకున్న దర్శకుడు శ్రీనివాసరాజు తన తదుపరి సినిమా ఇదే బాటలో నడిపిస్తున్నాడు. నిర్మాణ దశలోనే ఆ సినిమా వివాదాస్పదం కావడమే కాకుండా- కర్ణాటక అసెంబ్లీలో సైతం చర్చనీయాంశమైంది.

ఇదే గొడవైంది..
ఈ ఏడాది మేలో ఆధ్యాత్మికవేత్త, మహాశివభక్తుడయిన బసవేశ్వరుడి జయంతి సందర్భంగా శ్రీనివాసరాజు తను హీరో ఉపేంద్రతో రూపొందిస్తున్న ‘బసవణ్ణ' సినిమా పోస్టర్ డిజైన్ ఇంటర్‌నెట్‌లో విడుదల చేశాడు.చేతికి రుద్రాక్షమాలలు, వంటికి పులిచర్మం ధరించిన ఓ తపస్వి దండ కమండలాల బదులు పక్కనే గన్‌తో ఉండటమే ఆ పోస్టర్ డిజైన్.

ఆగ్రహం,నిరసనలు
బసవేశ్వర జయంతి రోజున ఈ డిజైన్, ‘బసవణ్ణ' టైటిల్‌తో రావడం- దానికితోడు ‘దండుపాళ్యం'వంటి వివాదాస్పద చిత్రం తీసిన దర్శకుడు శ్రీనివాసరాజు కావడం- ఆగ్రహం కలిగించింది. వెంటనే పలు రూపాల్లో తమ నిరసన వ్యక్తంచేశారు- ప్రజలు.

అబ్బే అలాంటిదేం లేదు
కన్నడ టివి ఛానెల్స్‌లో జరిగిన చర్చాగోష్టుల్లో దర్శకుడు శ్రీనివాసరాజు మాట్లాడుతూ - ‘బసవేశ్వరుడి కాలంలో గన్స్ లేవు కదా'అని సమర్ధించుకునే ప్రయత్నం చేశాడు. కేవలం ఆ టైటిల్‌తో రూపొందిస్తున్న సాంఘిక చిత్రమని ప్రకటించాడు.

ముఖ్యమంత్రి సైతం
అయినా ఆ టైటిల్ మార్చవలసిందేనని బసవేశ్వరుడి భక్తులు పట్టుబట్టారు. చివరికి కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప సైతం అసెంబ్లీలో ఈ సినిమా టైటిల్ మార్చకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరించాడు.

మళ్లీ రచ్చ..
దాంతో కాస్త వెనుకడుగేసిన దర్శక నిర్మాతలు- ‘బసవణ్ణ' టైటిల్ కాస్త ‘బ్రాహ్మణ'అని మార్చారు. ఆ టైటిల్ కూడా వివాదాస్పదమైంది. ప్రజల్లోనుంచి ఆ టైటిల్ పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.

తెలుగులోనూ వస్తుంది...
ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ కన్నడ చిత్రం త్వరలో విడుదల కాబోతుంది. ‘దండుపాళ్యం' తెలుగులో సక్సెస్ అయ్యింది. కాబట్టి- ఈ ‘బ్రాహ్మణ'చిత్రం కూడా తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేసే అవకాశం ఉంది. సినిమా విడుదలయితే కానీ, ఆ సినిమా కధేంటో, అందులో ఏ అంశాలు వివాదాస్పదమవుతాయో కాదో కూడా తెలీదు.


Click it and Unblock the Notifications











