»   » ‘బాహుబలి-2’ బెనిఫిట్ షోలపై తెలంగాణ సర్కార్ సీరియస్

‘బాహుబలి-2’ బెనిఫిట్ షోలపై తెలంగాణ సర్కార్ సీరియస్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'బాహుబలి-2' బెనిఫిట్ షోలపై తెలంగాణ సర్కార్ సీరియస్ అయింది. ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి బెనిఫిట్ షోలు వేయకూడదని సర్కార్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా బేఖాతరు చేయడంపై సినిమాటోగ్రపీ మంత్రి మంత్రి తలసాని శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేసారు.

హైదరాబాద్ లో కొన్ని చోట్ల థియేటర్స్ యాజమాన్యాలు ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోకుండా బెనిఫిట్ షోలకు టికెట్స్ అమ్మారు. చాలా చోట్ల ఇప్పటికే టికెట్స్ అమ్ముడయ్యాయి. ఈ రోజు(గురువారం) రాత్రి పదిన్నరకు పలు థియేటర్స్ లో బెనిఫిట్ షోలు వేసేందుకు రంగం సిద్ధం చేసారు.


కఠిన చర్యలు తప్పదు

కఠిన చర్యలు తప్పదు

బాహుబలి-2 మేనియాను క్యాష్ చేసుకోవడానికి థియేటర్ల యాజమాన్యాలు నిబంధనలకు విరుద్ధంగా వ్యవమరించడంపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ... బెనిఫిట్ షోలకు పర్మిషన్ అసలు ఇవ్వ లేదని, ఏప్రిల్ 28 నుండి ఐదు షోలకు మాత్రమే పర్మిషన్ ఇచ్చామని, ఇష్టానుసారంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.


తలసాని వార్నింగ్

తలసాని వార్నింగ్

బెనిఫిట్ షోల పేరుతో ఎవరు ఎవరికి బెనిఫిట్ చేస్తున్నారో అర్థం కావడం లేదని, ఆ విషయంలో చాలా సీరియస్ గా ఉంటాం.... ఆ తర్వాత జరిగే పరిణామాలు, ప్రభుత్వం తీసుకునే చర్యలకు థియేటర్ యాజమాన్యాలే బాధ్యత వహించాల్సి వస్తుందన్నారు మంత్రి తలసాని


ఐదు షోలు అనుమతి

ఐదు షోలు అనుమతి

తెలంగాణ ప్రభుత్వం బాహుబలి-2 లాంటి గొప్ప సినిమాను ప్రమోట్ చేస్తుందని, అందుకే ఐదు షోలకు అనుమతి ఇచ్చిందని.....గవర్నమెంట్ ఏ రేట్లు అయితే ఫిక్స్ చేసిందో అదే రేట్లకు టికెట్స్ అమ్మాలని, డిమాండ్ ఎక్కువగా ఉందని ఎక్కువ రేట్లకు టికెట్లు అమ్ముతూ ప్రేక్షకులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.


అయోమయంలో

అయోమయంలో

ఈ పరిణామాల నేపథ్యంలో ఈ రోజు బెనిఫిట్ షోల టికెట్స్ కొనుగోలు చేసిన వారు అయోమయంలో పడ్డారు. షో మొదలయ్యే వరకు అసలు సినిమా ప్రదర్శన ఉంటుందో? లేదో? తెలియని పరిస్థితి.

English summary
Telangana state minister for Cinematography Talasani Srinivas Yadav said that the Telangana govt. has not given permission for any exhibitor to hold benefit shows and that strict action would be taken if any theatre management doesn't oblige the directives.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu