twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గోవా ఫెస్టివల్ లో తెలుగు సినిమాల పరిస్దితి

    By Srikanya
    |

    హైదరాబాద్ : గోవాలో 43వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం మొదలవుతోంది. ఆ వేడుకలో ఉన్న ఇండియన్‌ పనోరమా విభాగానికి ఒక్క తెలుగు సినిమా ఎంపిక కాకపోవటం అందరినీ ఆశ్చర్యపరిచి,జాతీయ స్ధాయిలో చర్చగా మారింది.మన దగ్గర ఏటా వందకి పైగా చిత్రాలు వస్తాయి. అయితే పనోరమాకి ఎంట్రీలుగా వెళ్లినవి కేవలం తొమ్మిది మాత్రమే. అందులో నాలుగు చిత్రాలు ఇంకా విడుదల కూడా కానివే. చిత్రాల ఎంపికకు రెండు దశలుంటాయి. తొమ్మిది మంది సభ్యులు మూడు కమిటీలుగా విడిపోతారు. వీళ్లు తమ ముందుకు వచ్చిన చిత్రాల నుంచి ఉత్తమమైనవాటిని ఎంపిక చేస్తారు. ఇది ప్రాథమిక దశ. మూడు కమిటీల నుంచీ వచ్చినవాటిని అందరూ కలిసి వీక్షిస్తారు. వాటి నుంచి కొన్నింటిని వడబోసి మేలైన వాటిని తీసుకువస్తారు. ప్రాథమిక స్థాయిలో మన సినిమాలన్నీ తిరస్కారానికి గురయ్యాయి.

    కమిటీ ముందుకు వెళ్లినవాటిలో 'ఒక రొమాంటిక్‌ క్రైమ్‌ కథ', 'మల్లెల తీరం', 'మా ఊరి జోగిని' లాంటివి ఉన్నాయి. బాక్సాఫీసు దగ్గర విజయవంతమై... సాంకేతికపరమైన హంగులతో ఆశ్చర్యపరచిన 'ఈగ' సినిమా అసలు ఎంట్రీగానే వెళ్లలేదు. 'అంత పెద్ద చిత్రసీమ నుంచి ఒక్క సినిమా కూడా లేకపోతే బాగోదు ఏదైనా మంచి చిత్రం ఉంటే చూడండి' అని న్యాయనిర్ణేతలే చొరవ తీసుకొని వెదికారు. దొరకని పరిస్థితి నెలకొని ఉంది. అయినా ఫలితం లేదు.

    43వ అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ఇండియన్‌ పనోరమాకి భారతీయ భాషా చిత్రాల్ని ఎంపిక చేసేందుకు తొమ్మిది మందితో ఓ కమిటీ ఏర్పాటైంది. ప్రముఖ బెంగాలీ దర్శకుడు బుద్ధదేవ్‌ దాస్‌ గుప్తా ఆ కమిటీకి సారథి. వారి ముందుకు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ, మరాఠీ, బెంగాలీ, అస్సామీ, తెలుగు, కొంకణీ... ఇలా అన్ని భాషల నుంచీ చిత్రాలొచ్చాయి. అంతిమంగా చిత్రాల్ని ఎంపిక చేసేటప్పుడు- న్యాయనిర్ణేతలు ఒక్క తెలుగు సినిమా కూడా లేదే అన్న విషయాన్ని గ్రహించారు. వచ్చిన వాటిలో ఒక్కటైనా నిబంధనలకు అనువుగా ఉంటే ఎంపిక చేద్దామని ప్రయత్నిస్తే ఏ సినిమా నిలబడలేదు.

    మూడంకెల సంఖ్యలో చిత్రాలను ఉత్పత్తి చేసే రంగం నుంచి కేవలం తొమ్మిది చిత్రాలు పోటీకి వెళ్లడం శోచనీయం. మలయాళంలో ఏటా అరవై డెబ్భై చిత్రాలు వస్తున్నాయి. పనోరమాకి 32 సినిమాలు 'ఎంట్రీ'లుగా వెళ్లాయి. అయిదు ఎంపికయ్యాయి. బెంగాలీ నుంచి ఇరవై సినిమాలను పంపించారు. మూడు ప్రదర్శితం కాబోతున్నాయి. కొంకణీలో ఏటా మూడునాలుగు చిత్రాలొస్తాయి. ఆ భాష నుంచీ ఓ సినిమా పనోరమాకి ఎంపికైంది. భోజ్‌పురి భాషనుంచీ సృజనాత్మక చిత్రం ఒకటి రావడంతో దాన్ని పనోరమాకి ఎంపిక చేశారు.

    English summary
    Not a single Telugu film will be screened at the 43rd International Film Festival of India, 2012 beginning in Goa from November 19. That means the Telugu film industry will go unrepresented at the centenary celebrations of Indian cinema. In further embarrassment to Tollywood, regional films in Kannada, Malayalam and Tamil have found a place in the all-important Indian Panorama section where the best of the country's films will be showcased to the international audience. In fact there are as many as five Malayalam movies in the section. While movies in Assamese, Bengali, Bhojpuri, Byari, Hindi/Marathi, Hindi/English, Konkani and Punjabi have met the criteria but none from Telugu have made the cut.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X