అవకాశాలు రాకున్నా సరే... ఆ పని చేయనంటున్న హాటీ
అవకాశాలు రాక పోయినా సరే బికినీలు, లిప్ లాక్ సీన్లు లాంటి వాటివి చేయనంటోంది దబాంగ్ బ్యూటీ సోనాక్షి సిన్హా. ఇటీవల రౌడీ రాథోడ్ చిత్రంలో అనుష్క విక్రమార్కుడులో పోషించి పాత్రను పోషించి....బొడ్డు అందాల విషయంలో అనుష్కను మరిపించిన సోనాక్షి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన భావాలను పంచుకుంది.
'నటిగా ఎవరి పరిధులు వారికుంటాయి. నేను సంప్రదాయాలకు గౌరవమిచ్చే కుటుంబంలో పుట్టి పెరిగాను. ఎట్టి పరిస్థితుల్లో బికినీ ధరించి నటించను' అని చెబుతోంది సోనాక్షి సిన్హా. సినిమాల్లో అవకాశాలు రాకపోయిన ఫర్వాలేదు కానీ బికినీ, లిప్‌లాక్ సన్నివేశాలకు తాను చాలా దూరంగా వుంటానని అంటోంది సోనాక్షి.
నేను నటించిన రెండు చిత్రాల్లో అసభ్యతకు తావులేని వస్త్రధారణతో కనిపించాను. ప్రేక్షకులు నా పట్ల మంచి ఆదరణ కనబర్చారు. అలాంటప్పుడు బికినీలో నటించాల్సిన అవసరమేమిటి? అయితే ఇతర తారలు బికినీలు ధరించడాన్ని నేను తప్పు పట్టను. అది వారి వ్యక్తిగత విషయం అని గడుసుగా మాట్లాడుతోంది.
పట్టణ యువతిగా మోడ్రన్ పాత్రల్లో నటించడం కన్నా గ్రామీణ యువతి పాత్రల్నే నేను ఎక్కువగా ఇష్టపడతాను. 'దబాంగ్' 'రౌడీ రాథోర్' చిత్రాల్లో ఆ తరహా పాత్రల్ని పోషించాను. భవిష్యత్తులో కూడా గ్రామీణ నేపథ్యం వున్న పాత్రల్ని చేయడానికి ప్రాధాన్యతనిస్తాను. నాన్నగారు (శవూతుఘ్నసిన్హా) కూడా గ్రామీణ యువతి పాత్రల్లో నేను బాగుంటానని కితాబిచ్చారు' అని చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం సోనాక్షి అక్షయ్‌తో రౌడీరాథోడ్ నటించగా అది భారీ విజయం సాధించింది. మరో వైపు ఆమె జోకర్ చిత్రంలో నటిస్తోంది. తాజాగా మందానికి పాత్రలో అక్షయ్‌కుమార్ కలిసి మూడో సారి నటించబోతోంది సోనాక్షి. ఈ చిత్రాలు హిట్టయితే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ల సరసన చేరవచ్చని బోలెడు ఆశలు పెట్టుకుంది సోనాక్షి.


Click it and Unblock the Notifications











