twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బికినీ మ్యాటర్ పై తేల్చి చెప్పిన తమన్నా

    By Srikanya
    |

    ముంబై : టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగుతున్న తమన్నా బాలీవుడ్ 'హిమ్మత్‌వాలా' కోసం తమన్నా బికినీ వేస్తుందంటూ గత కొంతకాలంగా బాలీవుడ్‌లో ప్రచారమవుతోంది. దీనిపై తమన్నా స్పందించింది. ''హిమ్మత్‌వాలా సినిమాలో ఈత దుస్తులతో కనిపించడం లేదు. ఆ అవసరం కూడా రాలేదు. అయినా నన్ను నేను నిరూపించుకోవడానికి ఇంకా ఏం మిగిలింది? అభినయపరంగా చక్కటి పాత్రలు దక్కాయి. బికినీ వేసుకొని ఏం నిరూపించుకోవాలి? పాత్రకు ఏం కావాలో అది చేస్తే సరిపోతుంది. అనవసర హంగామాను ప్రేక్షకులు కూడా హర్షించరు'' అంది.

    అలాగే ''వాణిజ్య సూత్రాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిందే. కాకపోతే... అవి వేసుకొనే దుస్తులు నిర్ణయించవు. పరిశ్రమలో క్రమశిక్షణ చాలా ముఖ్యం. తెరపై కూడా అంతే మర్యాదగా నడుచుకోవాలి. శ్రీదేవిలాంటి గొప్ప కథానాయిక పోషించిన పాత్ర నాకు దక్కడం అదృష్టమే. కాకపోతే ఇందులో బాధ్యత కూడా ఉంది. ఈ అవకాశాన్ని వృథా చేసుకోను'' అని చెప్పుకొచ్చింది. ఈ చిత్రానికి సాజిద్ ఖాన్ దర్శకత్వం వహిస్తుండగా వాసు భగ్నాని, యూటీవీ సంయుక్తంగా ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు.

    తెలుగులో కృష్ణ,జయప్రద జంటగా కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన 'ఊరికి మొనగాడు' చిత్రం విజయాన్ని సాధించింది. ఈ సినిమాను పద్మాలయా సంస్థ హిందీలో 'హిమ్మత్ వాలా' పేరుతో తెరకెక్కించింది. ఇందులో జితేంద్ర, శ్రీదేవి నాయకానాయికలుగా నటించారు. ఈ సినిమాకు కూడా కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంతోనే బాలీవుడ్ లో శ్రీదేవి అందాల తారగా మార్కులు సంపాదించారు. ఇప్పుడు అదే చిత్రం రీమేక్‌లో తమన్నా నటిస్తోంది.

    బాలీవుడ్ హీరోల్లో చాలామంది రీమేక్స్ పై దృష్టి సారించారు. తాజాగా అజయ్ దేవగన్ కూడా అదే బాట పట్టి, జితేంద్రకు గ్రాండ్ సక్సెస్ ను అందించిన 'హిమ్మత్ వాలా'ను ఎంచుకున్నారు. ఈ చిత్రంలో ఈ పాత్ర కోసం సాజిద్ ఖాన్ కత్రిన కైఫ్ మరియు అనుష్క శర్మలను సంప్రదించగా వారు ఒప్పుకోలేదు . అజయ దేవగన్ ఈ పాత్రకి సౌత్ ఇండియన్ నటిని తీసుకోమని సలహా ఇచ్చారు సాజిద్ ఖాన్ తమన్నాని ఎంచుకున్నారు. ఈ చిత్రంలో సాజిద్ ఖాన్ చాలా మార్పులు చేసినట్టు తెలుస్తుంది.

    English summary
    
 Grapevine has it that Tamannah is going to expose her svelte bod to the hilt by sporting a bikini in Himmathwala. Industry pundits add Tamanna’s oomph factor and it will be entertainment unlimited. The pretty girl laughs it off as a ‘pure unadulterated rumour’. “I guess the producers who approach me for a film know very well that I have a couple of pre-conditions in the contract itself and that I will never sport a bikini or act in an explicit kissing scene. This will probably clear yet another baseless rumour,” asserts the ravishing girl.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X