తెలుగు సినిమాల్లోకే అంటున్న వాసుకి
తనకు సినిమా అవకాశాలు వస్తున్న మాట వాస్తవమే కానీ, నాటించే విషయమై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఐయామ్ షి మిస్ యూనివర్స్ ఇండియా 2011 విజేత వాసుకి సుంకవల్లి. నటిస్తే తొలుత తెలుగులోనే నటిస్తానని, బాలీవుడ్ లో కాదు అని స్పష్టం చేసింది. గురువారం రాజమండ్రిలోని తన బంధువుల ఇంటికి వచ్చిన ఆమెకు రైల్వే స్టేషన్ లో ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. గెలిచిన తర్వాత తమ సొంత ప్రాంతానికి రావడం ఇదే తొలిసారిని, తన స్వగ్రామమైన ఉంగుటూరుకు కూడా వెళ్లి తమ సన్నిహితులను కలుస్తానని వాసుకి వెల్లడించింది.
వాసుకి ఇటీవల ప్రపంచ సుందరి పోటీల్లో పాల్గొని ఓటమి పాలైంది. మిగతా సుందరాంగుల మాదిరే తొలుత మోడలింగ్ లో రాణించి తర్వాత సినిమాల్లో అడుగు పెట్టాలనే ఆలోచనతో ఉన్న వాసుకి, ఇటు రాజకీయాల వైపుకూడా కన్నేసింది. మరి వాసుకి చివరకు ఏ రంగంలో సెటిల్ అవుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











