twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కష్టాల్లో రజనీ ‘కాలా’, దిల్ రాజును కలిసిన ధనుష్: మహేష్, బన్నీని తట్టుకోలేం....

    By Bojja Kumar
    |

    Recommended Video

    కష్టాల్లో రజనీ ‘కాలా’: మహేష్, బన్నీని తట్టుకోలేం...!

    రజనీకాంత్ హీరోగా 'కబాలి' ఫేం పా రంజిత్ దర్శకత్వంలో 'కాలా' చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సాధారణంగా అయితే రజనీకాంత్ సినిమాకు తెలుగులో భారీ డిమాండ్ ఉంటుంది. అయితే 'కాలా' విషయంలో మాత్రం అలా లేదట. ఏప్రిల్‌లో 27న 'కాలా' చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. అయితే నిర్మాతలు ఆశించిన రేటుకు ఈ చిత్రాన్ని కొనేందుకు తెలుగు బయ్యర్లు ముందుకు రావడం లేదట.

     90 కోట్లకు 2.0.... ‘కాలా' పరిస్థితి దారుణం

    90 కోట్లకు 2.0.... ‘కాలా' పరిస్థితి దారుణం

    శంకర్ దర్శకత్వంలో రాబోతున్న రజనీకాంత్ మూవీ ‘2.0' రూ. 90 కోట్లకు ఏషియన్స్ ఫిల్మ్ వారు కొనుగోలు చేశారు. అయితే ‘కాలా' చిత్రాన్ని రూ. 30 కోట్లకు కూడా ఎవరూ కొనడానికి సాహసించడం లేదని తెలుస్తోంది.

     ‘కబాలి' ప్లాప్ ఎఫెక్ట్

    ‘కబాలి' ప్లాప్ ఎఫెక్ట్

    రజనీకాంత్, పా రంజిత్ కాంబినేషన్లో వచ్చిన గత చిత్రం ‘కబాలి' తెలుగునాట దారుణమైన ప్లాప్ అయింది. తెలుగులో ఈచిత్రాన్ని కొన్న బయ్యర్లు తీవ్రంగా నష్టపోయారు. మళ్లీ అదే కాంబినేషన్లో వస్తున్న చిత్రంపై భారీగా కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి ఎవరూ ముందుకు రావడం లేదు.

    దిల్ రాజును కలిసిన ధనుష్

    దిల్ రాజును కలిసిన ధనుష్

    ‘కాలా' చిత్రాన్ని మంచి ధరకు అమ్మడానికి నేరుగా ఈ చిత్ర నిర్మాత, రజనీకాంత్ అల్లుడు, తమిళ హీరో ధనుష్ రంగంలోకి దిగారు. ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు, డిస్ట్రిబ్యూటర్ చదలవాడ సోదరులను కలసి చర్చలు జరిపినట్లు సమాచారం.

     మహేష్, బన్నీని తట్టుకోలేం....

    మహేష్, బన్నీని తట్టుకోలేం....

    ‘కాలా' సినిమా విడుదల సమయంలోనే తెలుగులో రెండు భారీ చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. అందులో ఒకటి మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ‘భరత్ అను నేను', అల్లు అర్జున్ చిత్రం ‘నా పేరు సూర్య' విడుదలకు సిద్ధమవుతోంది. ఈ రెండు సినిమాలను బాక్సాఫీసు వద్ద తట్టుకుని మూడో సినిమా నిలబడటం చాలా కష్టం. అందుకే బయ్యర్లు ఎవరూ ముందుకు రావడం లేదు.

    ‘కాలా'కు కష్టకాలమే...

    ‘కాలా'కు కష్టకాలమే...

    పరిస్థితి చూస్తుంటే కాలాకు కష్టకాలం అని చెప్పక తప్పదు. నిర్మాత ధనుష్ అటు సినిమాను మరో తేదీకి వాయిదా వేలయలేక, ఇటు తక్కువ రేటుకు అమ్మలేక సతమతం అవుతున్నాడు. మరి ఈ పరిస్థితి నుండి ‘కాలా' ఎలా గట్టెక్కుతుందో చూడాలి.

    English summary
    No buyers for superstar Rajinikanth's Kaala Movie which never happened before. Kaala movie is produced by his son-in-law Dhanush and scheduled for a launch on 27 April. 2 big movies of Allu Arjun and Mahesh Babu will also be releasing at the same time due to which buyers are not coming forward.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X