చిరు పేరు మార్పు వెనుక అసలు నిజం ఇదీ.. ఆ తప్పుతో కొత్త అనుమానాలు!

మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలను లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన నటిస్తున్న గాడ్ ఫాదర్ సినిమా నుంచి తాజాగా మేకర్స్ ఒక అప్డేట్ విడుదల చేశారు. మెగాస్టార్ చిరంజీవి స్టైలిష్ గా నడిచి వస్తున్న వీడియోని షేర్ చేయడంతో వీడియో వెంటనే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మలయాళంలో మోహన్ లాల్ హీరోగా నటించి సూపర్ హిట్ అందుకున్న లూసిఫర్ సినిమాని తెలుగులో గాడ్ ఫాదర్ పేరుతో విడుదల చేస్తున్నారు.

ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహిస్తుండగా మలయాళంలో మోహన్ లాల్ నైటించిన పాత్రలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్నారు. పృధ్వీరాజ్ సుకుమారన్ నటించిన పాత్రలో సల్మాన్ ఖాన్, వివేక్ ఒబెరాయ్ నటించిన పాత్రలో సత్యదేవ్, మంజు వారియర్ నటించిన పాత్రలో నయనతార నటిస్తున్నారు.

ఇక మెగాస్టార్ చిరంజీవి వెన్నంటే ఉండే అనుచరుడి పాత్రలో ఒకప్పటి కమెడియన్ తర్వాత హీరోగా మారి మళ్ళీ ఇప్పుడు కామెడీ పాత్రలవైపు మళ్లిన సునీల్ నటిస్తున్నారు. తాజాగా విడుదల చేసిన వీడియోలో మెగాస్టార్ చిరంజీవి పేరులో ఒక అక్షరం అదనంగా ఉండడంతో ఆయన న్యూమరాలజిస్టుల సలహా మేరకు ఈ విధంగా పేరు మార్చుకుని ఉండవచ్చు అంటూ ప్రచారం మొదలైంది.

no change of spelling in megastar chiranjeevis name

అయితే మెగాస్టార్ చిరంజీవి సన్నిహిత వర్గాల సమాచారం మేరకు అది నిజం కాదని అంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి న్యూమరాలజిస్ట్ సలహాలు తీసుకోలేదని గాడ్ ఫాదర్ యూనిట్ వీడియో ఎడిట్ చేస్తున్న సమయంలో జరిగిన పొరపాటు వల్లే మెగాస్టార్ చిరంజీవి పేరులో ఒక అక్షరం అదనంగా వచ్చి చేరిందని వారు క్లారిటీ ఇచ్చారు.

ఈ విషయం మీద ఇలాంటి ప్రచారాలు మొదలు కావడంతో అసలు అదేది నిజం కాదని వారు క్లారిటీ ఇచ్చినట్లు అయింది. మోహన్ రాజ దర్శకత్వం వహిస్తున్న గాడ్ ఫాదర్ సినిమాను సూపర్ గుడ్ ఫిలిమ్స్, కొణిదెల ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు ఆర్బీ చౌదరి, ఎన్ వి ప్రసాద్ సంయుక్తంగా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ సినిమాకి మెగాస్టార్ సతీమణి సురేఖ సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఒక జర్నలిస్ట్ పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటికే కొన్ని సినిమాలలో పూరి జగన్నాథ్ చిన్న చిన్న పాత్రలలో కనిపించారు కానీ పూర్తి స్థాయిలో కొంత మేర అతిథి పాత్ర చేయడం మాత్రం ఇదే మొదటిసారి అని చెప్పవచ్చు. ఎక్కువగా పూరి జగన్నాథ్ తన సినిమాలలో అలా వచ్చి వెళ్ళిపోయే క్యారెక్టర్లు చేసి ప్రేక్షకులకు దగ్గరయ్యారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X