రాధేశ్యామ్ విడుదలపై మరో అనుమానం.. రిలీజ్ ఎప్పుడంటే?

కరోనా వైరస్ కాస్త తగ్గుముఖం పట్టడంతో దేశంలో మళ్లీ అన్ని రంగాల్లో బిజినెస్ లు కూడా ఊపందుకుంటున్నాయి. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో కూడా బిజినెస్ రేట్స్ మెల్లగా పెరుగుతున్నాయు. మొన్నటి వరకు థియేటర్స్ చాలాచోట్ల మూత పడిన విషయం తెలిసిందే. కేవలం తెలుగు ఇండస్ట్రీలో మాత్రమే మంచి సినిమాలు బాక్స్ ఆఫీసు వద్ద భారీ విజయాలను అందుకుంటున్నాయి. ఇక ఇటీవల లవ్ స్టోరీ కూడా మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉన్న చాలా సినిమాలు రాబోయే ఫెస్టివల్స్ ను టార్గెట్ చేస్తున్నాయి.

ముఖ్యంగా 2022 సంక్రాంతికి ఒకేసారి ముగ్గురు పెద్ద హీరోలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతున్నారు పవన్ కళ్యాణ్ సినిమా తో పాటు మహేష్ బాబు సర్కారు వారి పాట కూడా సంక్రాంతి బరిలో నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఈ బాక్స్ ఆఫీస్ ప్రభాస్ ప్రాజెక్ట్ లో పూజా హెగ్డే నటించిన రాధేశ్యామ్ కూడా ఉంది. ఈ సినిమాను జనవరి 14న విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల RRR సినిమా కూడా బాక్సాఫీస్ పోటీకి సిద్ధం అవ్వడంతో ఒక్కసారిగా విడుదల తేదీలో మార్పులు వచ్చినట్లు టాక్ అయితే వచ్చింది.

జనవరి 12న రాబోతున్నట్లు అయితే టాక్ వస్తుంది. పాన్ ఇండియా సినిమా కాబట్టే అన్ని వైపులా ఇండస్ట్రీల నుంచి కలెక్షన్స్ అందుకోవాలి కనుక అదే బెస్ట్ డేట్ అని నిర్ణయం తీసుకున్నారట. ఈ సినిమా విడుదల తేదీపై ప్రస్తుతం మిగతా హీరోల నిర్మాతలు చర్చలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. అవసరమైతే విడుదల తేదీలను మళ్ళీ మార్చుకోవాలని అనుకుంటున్నారట. పొంగల్ ఫెస్టివల్ ఎంతగా ఉపయోగపడినప్పటికీ కూడా సినిమా కలెక్షన్స్ పై తీవ్రస్థాయిలో ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ఇక అందుకే ప్రభాస్ రాదేశ్యామ్ సినిమా విడుదల తేదీని మార్చే అవకాశం ఉన్నట్లు కొన్ని కథనాలు వెలువడ్డాయి.

No changes in Prabhas Radhe shyam release

అయితే అందులో ఎలాంటి అనుమానం లేదని మరోసారి చిత్ర యూనిట్ సభ్యులు క్లారిటీ ఇచ్చేశారు. అనుకున్న సమయానికే జనవరి 14వ తేదీన ప్రభాస్ రాధేశ్యామ్ సినిమా థియేటర్లో విడుదల అవుతుందని క్లారిటీగా చెప్పారు. ఇక ఇటీవల పవన్ కళ్యాణ్ భీమ్ల్ నాయక్ సినిమా విడుదల తేదీ కూడా వాయిదా వేసే అవకాశం ఉన్నట్లు కథనాలు వచ్చాయి. కానీ ఆ రూమర్స్ లో కూడా ఎలాంటి నిజం లేదని చిత్ర నిర్మాణ సంస్థ అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చేసింది. RRR వస్తుండడంతో తప్పకుండా మిగతా హీరోలు బాక్సాఫీస్ పోటీ నుంచి తప్పుకునే అవకాశం ఉన్నట్లు టాక్ అయితే బాగానే వచ్చింది కానీ ప్రస్తుతం మాత్రం వెనక్కి తగ్గేందుకు ఎవరు సిద్ధంగా లేరని తెలుస్తోంది.

బిల్లా నాయక్ ప్రదేశం సినిమాల విషయంలో క్లారిటీ అయితే వచ్చింది ఆ సినిమాలో అనుకున్న సమయానికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి ఇక త్రిబుల్ ఆర్ సినిమా జనవరి 12న రాబోతున్నట్లు ఈ టీమ్ నిర్ణయం తీసుకున్నారట. అయితే ఇక మహేష్ బాబు సినిమా జనవరి 13 న రిలీజ్ కాబోతుంది. మరి ఈ మూడు రోజుల్లో బాక్సాఫీసు వద్ద ఎలాంటి రికార్డులు నమోదు అవుతాయి చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X