చరణ్ ఛార్టెడ్ ప్లైట్ గిప్ట్ పై ఉపాసన కామెంట్
రామ్ చరణ్, ఉపాసనల ఎంగేజ్ మెంట్ గిప్టుగా ఛార్టెడ్ ప్లైట్ ని ఇవ్వనున్నారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై రామ్ చరణ్ కాబోయే శ్రీమతి ఉపాసన స్పందిస్తూ అట్లాంటి బహుమతిలు ఏమీ తమ కుటుంబం ఇవ్వటం లేదని ఖండించారు. అలాగే రామ్ చరణ్ కూడా అట్లాంటి వాటిని తీసుకోరని, ఆ డబ్బుని ఆయన ఛారెటీ పర్పస్ కి ఖర్చుపెడతారని అన్నారు. ఇక రామ్ చరణ్, ఉపాసనా కామినేనిల ఎంగేజ్ మెంట్ కార్యక్రమాన్ని గ్రాండ్ గా నిర్వహించడానికి సన్నాహాలు జరగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మెగాస్టర్ చిరంజీవి ఇంట్లోనూ, అటు అపోలో ఛైర్ పర్సన్ ప్రతాప్ రెడ్డి ఇంట్లోనూ సందడి నెలకొందని తెలుస్తోంది.
డిసెంబర్ 1న ఉదయం 10గంటలకు ఈ వేడుక ఆరంభమవ్వనుందట. కరెక్ట్ గా 11.55కు రామ్ చరణ్ ఎంగేజ్ మెంట్ రింగ్ ని ఉపాసనాకి తొడగుతాడని తెలుస్తోంది. గండిపేట సమీపంలోని గోల్కోండ రిసార్ట్స్ లో ఈ వేడుక జరగనుంది. తన నిశ్చితార్థానికి రావాలని చెర్రీ గవర్నర్ దంపతులను ఆహ్వానించిన విషయం విధితమే. పలువురు సినీ ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా ఈ వేడుకలో పాల్గొనబోతున్నారని సమాచారం. అమితాబ్ ప్రత్యేక అతిధిగా ఈ పంక్షన్ కి హాజరు కానున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











