అనుష్కతో విభేదాలు లేవంటున్న దర్శకుడు
రాఘవ లారెన్స్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా 'రెబల్" సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో తొలుత అనుష్కను హీరోయిన్ గా తీసుకుంటున్నారనే వార్తలు వచ్చాయి. అయితే ఉన్నట్టుండి అనుష్కను తప్పించిన లారెన్స్ తమన్నాను హీరోయిన్ గాతీసుకుంటున్నారనే ప్రచారం జరిగింది.
తన గత సినిమా కాంచనలో నటించడానికి నిరాకరించిన అనుష్కను, లారెన్స్ కావాలనే రెబల్ నుంచి తప్పించారని సీనీ వర్గాల్లో చర్చ సాదగింది. కానీ ఈ వార్తలను తాజాగా లారెన్స్ ఖండించారు. అనుష్కతో తను ఎలాంటి విభేదాలు లేవని, ఆమె స్థానంలో తమన్నాను తీసుకుంటున్నట్లు వస్తున్న వార్తలో్లనూ నిజం లేదని స్పష్టం చేశారు. తాను ఇంకా రెబల్ సినిమాలో ఏ హీరోయిన్ ను ఖరారు చేయలేదని, రెబల్ లో ప్రభాస్ కు క్యారెక్టర్ కు సరిపోయే హీరోయిన్ కోసం వెతుకున్నామని స్పష్టం చేశారు.


Click it and Unblock the Notifications











