మెగా కాంపౌడ్ నుండి రాకపోతేయే నందమూరివి వచ్చాయిగా...!?
అల్లు శిరీష్ కోలీవుడ్ లో హీరోగా పరిచయం కానున్న విషయం తెలిసిందే. తెలుగులో నాగచైతన్య హీరోగా రూపొందిన '100% లవ్" చిత్రం తమిళ రీమేక్ లో అల్లు శిరీష్ హీరోగా పరిచయం కాబోతున్నాడు. ప్రస్తుతం సౌత్ స్కోప్ మ్యాగజైన్ ను నిర్వహిస్తోన్న అల్లు శిరీష్ ఇక పై ఫుల్ ప్లెడ్జ్ నిర్మాతగా, యాక్టర్ గా కొనసాగడానికి రంగం సిద్దం చేసుకుంటున్నాడు. అల్లు అరవింద్ కూడా శిరీష్ ని హీరోగా పరిచయం చేయడానికి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాడని సమాచారం.
కాగా రీసెంట్ గా అల్లు అర్జున్ నటించిన 'బద్రినాథ్" హిట్ చిత్రమని కలెక్షన్లు బాగా కురిపించిందని డబ్బాలు కొట్టుకుంది అల్లు కాంపౌండ్. కానీ ఇటీవల అల్లు శిరీష్ ఓ విషయం బయటపెట్టాడు. 2010,2011 టాలీవుడ్ కి కలిసిరాలేదని, కమర్షియల్ సక్సెస్ లు రాలేదని అన్నాడు. దీంతో అల్లు శిరీష్ పై చాలా మంది విమర్శలు గుప్పిస్తున్నారు. మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన సినిమాలు ఫ్లాప్ అయ్యాయిగానీ ..'అదుర్స్", సింహా", బృందావనం" చిత్రాలు భారీగా వసూళ్ళు చేసాయని, ఈ మాట చెప్పడం ఇష్టంలేక అల్లు శిరీష్ ఇలా చెప్పాడని అంటున్నారు. తమ సినిమాలు ప్లాప్ అయ్యాయి అని చెప్పకుండా, చీప్ గా ఇలాంటి మాటలు మాట్లాడి తన బుద్దిని మరోసారి బయట పెట్టుకున్నాడని కూడా శిరీష్ ని దుమ్మెత్తిపోస్తున్నారు...


Click it and Unblock the Notifications











