ఒక్క మగాడు సినిమా నిర్మాణంలో ఎక్కడా కంప్రమైజ్ కాలేదని ఆ చిత్ర దర్శక, నిర్మాత వైవియస్ చౌదరి అన్నారు. ఈ సినిమాను స్వయంగా తానే నిర్మించినప్పటికీ ఖర్చు విషయంలో ఎక్కడా వెనకాడలేదని చెప్పారు. ఇతర నిర్మాతలకు సినిమాలు చేసినప్పుడు దర్శకుడిగా వారిని డామినేట్ చేసే తాను ఇపుడు తానే నిర్మాతనైనా, గతంలోలా దర్శకుడిగానే పనిచేశానని ఆయన అన్నారు. ఈ సినిమాను అద్భుతంగా రూపొందించడం జరిగిందని, అనుకున్నట్టుగానే సినిమాకు విపరీతంగా క్రేజ్ వచ్చిందని, క్రేజ్ కు తగ్గట్టుగానే సినిమా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఒక్క మగాడు సినిమా కథ బాలకృష్ణకు మాత్రమే స్యూట్ అవుతుందని, మరెవరినీ రీప్లేస్ చేయలేమని, ఆయన నో అంటే ఒక్క మగాడు సినిమా లేదని వైవియస్ చౌదరి చెప్పారు.