twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నో కండోమ్‌ 'యాడ్స్‌': ఇక సన్నీ లియోన్ పాపం!

    |

    Recommended Video

    నో కండోమ్‌ 'యాడ్స్‌' : ఇక సన్నీ లియోన్ పాపం !

    కండోమ్‌ ప్రకటనలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఎక్కడ చూసినా అవే. హోర్డింగ్స్‌ పై అవే. ఇక సన్నీ లియోన్ కండోమ్‌ ప్రకటన చేసాక దాన్ని ప్రసారం చెయ్యటం ఇంకా ఎక్కువైందనే చెప్పాలి. అయితే ఇంట్లో కూర్చుని ఫ్యామిలీతో కలిసి టీవీ చూస్తున్నపుడు మాత్రం కండోమ్‌ ప్రకటనలు రావటం ఇబ్బందిగానే ఉంటుందనేది తెలిసిన విషయమే. మరి పెద్దవాళ్ళే అలా ఇబ్బంది పడుతున్నారంటే ఇక చిన్నపిల్లలను అవి ఎంత ప్రభావితం చేస్తాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే దీనికి చరమ గీతం పాడేందుకు కేంద్రం ప్రభుత‍్వం కీలక నిర్ణయం తీసుకుంది.

    ముఖ‍్యంగా చిన్నపిల్లలను ఈ ప్రభావం నుంచి రక్షించేలా కొన్ని ఆంక్షలు విధించింది. చిన్న పిల్లలపై ప్రభావం చూపే ఆ యాడ్స్‌ను ప్రసారం చేయరాదు అని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే మొత్తానికి వాటిని బ్యాన్ చెయ్యడం కూడా కుదరదనో, మరి వాటివల్ల అవగాహన కలుగుతుందన్న ఉద్దేశ్యం తోనో ప్రసార సమయాలను మార్చింది. ఉదయం పూట
    కండోమ్‌ ప్రకటనలు వెయ్యడానికి వీల్లేదని స్పష్టం చేసింది. అంతేకాదు ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని కూడా హెచ్చరించింది. కండోమ్‌ ప్రకటనలు, ప్రసార సమయాలపై ఇటీవల ఇండియన్‌ అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఆస్కి), మంత్రిత్వ శాఖకు అందించిన సూచనల మేరకు ఈ దేశాలు జారీ అయ్యాయి.

    కండోమ్ వాణిజ్య ప్రకటనలను ఉదయం వేళ ప్రసారం చేయరాదు అని కేంద్ర ప్రభుత్వం దేశంలోని అన్ని టీవీ ఛానళ్లకు ఆదేశాలు జారీ చేసింది. ఇకపై ఉదయం 6 గంటలనుంచి రాత్రి 10 గంటల వరకు ప్రసారం చేయడానికి వీల్లేదని సమాచార, ప్రసార శాఖ మంత్రిత్వశాఖ ఆదేశించింది.

    ఇప్పటికే కొన్ని ఆదేశాలు ఉన్నా.. ఛానళ్లు కండోమ్ యాడ్స్ ప్రసారం చేస్తున్నాయని విమర్శలు చెలరేగాయి. ఈ నేపథ్యంలోనే రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు మాత్రమే ఈ యాడ్స్‌ను ప్రసారం చేయాలని మంత్రిత్వ శాఖ సూచించింది. ఒకవేళ ఆదేశాలను ఉల్లంఘిస్తే, కేబుల్ టెలివిజన్ నెట్‌వర్క్‌​ రూల్స్ ప్రకారం చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది.

    Read more about: tv channels children government
    English summary
    The government on Monday strictly asked TV channels not to air advertisements selling and promoting condoms because these are “indecent especially for children” and can create “unhealthy practices” among them.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X