twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ తమ్ముడు భేష్ : చిరంజీవి(వారసత్వం ఇష్యూ)

    By Bojja Kumar
    |

    అన్నయ్య చిరంజీవి వారసత్వంపై ఆధారపడి పైకి రావాలన్న ఉద్దేశ్యం తనకు లేదని తమ్ముడు పవణ్ కళ్యాణ్ ఇటీవల పంజా ఆడియో వేడుకలో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. పవన్ వ్యాఖ్యలపై తాజగా గురువారం చిరంజీవి స్పందించారు. వారసత్వంపై ఆధారపడకుండా పైకి రావాలనుకోవడం అభినందనీయమని వ్యాఖ్యానించారు. 'తమ్ముడు" సినిమా కోసం పవన్ చాలా కష్ట పడ్డాడని, పవన్ పట్టుదల చూసి పైకి వస్తాడని తాను ఆనాడే ఊహించానని, అందుకే ఇప్పడు ఈ స్థాయికి వచ్చాడని చిరంజీవి అన్నారు.

    పవన్ కళ్యాణ్ తో తమకు ఎలాంటి గొడవలు లేవని, తమ మధ్య విబేధాలు ఉన్నట్లు మీడియాలో వార్తలు రావడం దురదృష్టకరమని చిరంజీవి వ్యాఖ్యానించారు. పరిస్థితులను బట్టే ఏ వేడుకకైనా హాజరవుతామని, ఆరోజు తనకు వీలు కాక పోవడం వల్లనే పంజా ఆడియో వేడుకకు హాజరు కాలేక పోయానని అన్నారు. నేను హాజరు కాని ఫంక్షన్లు చాలా ఉన్నాయి. కావాలనే పుకార్లు పుట్టిస్తున్నారు. సినిమా రంగంలో ఇలాంటి పుకార్లు, వదంతులు సర్వసాధారణమే అని, వాటిని తాను అంతగా పట్టించుకోనని చిరంజీవి అన్నారు.

    చిరంజీవి ఆత్మాభిమానం చంపుకుని కాంగ్రెస్ లో చేరడం వల్లనే పవన్ చిరుకు దూరంగా ఉంటున్నాడని, అందుకే అతని వారసత్వం కూడా తనకు అక్కర్లేదని పంజా ఆడియో వేడుక సాక్షిగా ప్రకటటించాడని, ఒక రకంగా చిరంజీవి కాంగ్రెస్ విలీనంపై పవన్ తనదైన రీతిలో అసంతృప్తి 'పంజా" విసిరాడని మీడియాలో గత నాలుగు రోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.

    English summary
    'No conflict with Pavan' Chiranjeevi told.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X