Don't Miss!
- Finance Blood Bath: వారాంతంలో కుప్పకూలిన మార్కెట్లు.. బేర్స్ చేతిలో Sensex-Nifty..
- Technology Vivo V30e ఇండియా లాంచ్ తేదీ వివరాలు! లీక్ అయిన ధర, స్పెసిఫికేషన్లు
- News టీడీపీ అభ్యర్దుల మార్పు, ఎవరెక్కడ - రఘురామ పై తాజా నిర్ణయం..!!
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్‌క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్‌తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
శేఖర్ కమ్ముల లవ్ స్టొరీపై షాకింగ్ రూమర్స్... మరోసారి క్లారిటీ ఇచ్చిన ప్రొడక్షన్ టీమ్!
టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో లవ్ స్టొరీ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేయడానికి రెడీ అవుతోంది. టాలెంటెడ్ దర్శకుడు శేఖర్ కమ్ముల ప్రేమకథలు టచ్ చేస్తే తప్పకుండా మ్యాజిక్ క్రియేట్ చేయగలడని ఫిదా సినిమాతో అర్ధమయ్యింది. ఇక నాగచైతన్య - సాయి పల్లవిలతో చేస్తున్న లవ్ స్టొరీ సినిమా కూడా తప్పకుండా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రీయేట్ చేయడం కాయమని సాంగ్స్ తోనే అర్ధమవుతోంది.
అసలు మ్యాటర్ లోకి వస్తే 'లవ్ స్టోరీ' సినిమా వాయిదా పడే ఛాన్స్ ఉన్నట్లు గత కొన్ని రోజులుగా రూమర్స్ వస్తున్నాయి. కరోనా కారణంగా మళ్ళీ థియేటర్స్ పై ప్రభావం పడే అవకాశం ఉందని టాక్ రావడంతో దర్శకుడు సందిగ్ధంలో పడ్డట్లు కథనాలు కూడా వచ్చాయి. అయితే మొత్తానికి చిత్ర యూనిట్ ఆ రూమర్స్ పై క్లారిటీ ఇచ్చింది. అయితే అందులో ఎలాంటి నిజం లేదని సినిమాని నిర్మించిన శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి ట్వీట్ చేసింది.
సినిమా ఏప్రిల్ 16న అనుకున్న సమయానికి రానున్నట్లు చెబుతూ అందులో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదని పేర్కొన్నారు. ఇక సినిమాలో సారంగదరియా పాట యూ ట్యూబ్ లో 95మిలియన్ల వ్యూవ్స్ అందుకుంది. మరో 5మిలియన్ల వ్యూవ్స్ అందుకుంటే సాయి పల్లవి ఖాతాలో మరో సెంచరీ పడ్డట్లే. ఆ సాంగ్ తోనే సినిమాపై భారీ స్థాయిలో బజ్ క్రియేట్ అయ్యింది. ఇక సినిమాకు సంబంధించిన రెగ్యులర్ ప్రమోషన్ ను వచ్చే నెల సెకండ్ వీక్ నుంచి స్టార్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది.