'దాన వీర శూర కర్ణ' రీమేక్ గురించి రాజమౌళి
జూ ఎన్టీఆర్ తనకెంతో ఇష్టమైన 'దాన వీర శూర కర్ణ' చిత్రాన్ని రీమేక్ చేయాలని సంకల్పిస్తున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అలాగే ఈ చిత్రానికి దర్శకుడుగా ఎస్ ఎస్ రాజమౌళిని అడగటానికి సంసిద్దుడవుతున్నాడని వినపడింది. అయితే రాజమౌళి అటువంటి ప్రాజెక్టు ఏదీ తాను చేయబోవటం లేదని తాజాగా స్పష్టం చేసారు. అయితే డైరక్టర్ ఎవరైనప్పటికీ ఎన్టీఆర్ మాత్రమే హీరోగా చేస్తారని అన్నారు. కాబట్టి ఫ్యాన్స్ ని వర్రీ కావద్దని అన్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్ లో ఆయన తెలియబరిచారు. ఈ ప్రాజెక్టు రూపుదాలిస్తే కనుక జూ ఎన్టీఆర్ ఈ చిత్రానికి నిర్మాతగా తనే ఉండాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. యమదొంగలో తన యముడు గెటప్ కు వచ్చిన రెస్పాన్స్ చూసాకే ఈ ప్రాజెక్టు ఆలోచన ఎన్టీఆర్ కి వచ్చిందట.
జూ ఎన్టీఆర్ రాజమౌళి మగధీర యమదొంగ దాన వీర శూర కర్ణ jr ntr rajamouli ram charan teja dana veera sura karna


Click it and Unblock the Notifications