ఇంకా డేట్ ఫిక్స్ కాలేదు
బాలీవుడ్ స్టార్స్ సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ గత కొన్ని సంవత్సరాలుగా సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే. పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయి ఒకరినొకరు విడవలేకుండా గడుపుతున్న ఈ జంట ఇప్పటి వరకు పెళ్లి మాత్రం చేసుకోలేదు. అదిగో..ఇదిగో అంటూ తమ పెళ్లి విషయాన్ని తేల్చకుండా ఏవో కహానీలు చెప్పుకుంటూ తప్పించుకుంటున్నారు. అభిమానులు, మీడియా ఎన్ని సార్లు ఈ విషయమై ప్రశ్నించినా ఇప్పటి వరకు పెళ్లి ఎప్పడు జరుగుతుందనే విషయమై ఓ క్లారీటీ మాత్రం ఇవ్వలేదు.

ఈ నేపథ్యంలో సైఫ్ అలీఖాన్ సోదరి సోహా అలీఖాన్ మాట్లాడుతూ ఇద్దరూ పెళ్లి చేసుకుంటున్న మాట వాస్తవమే కానీ...ఇంకా డేట్ ఫిక్స్ కాలేదని స్పష్టం చేసింది. వాళ్లు ఇంకా ఈ విషయమై ఏమీ మాట్లాడుకోలేదని వివరణ ఇచ్చింది. అక్టోబర్ 16న పెళ్లి జరుగుతుందని వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని తేల్చి చెప్పింది.
సైఫ్ గతంలో హీరోయిన్ అమృత సింగ్‌ను పెళ్లాడాడు. పదమూడేళ్ల కాపురం తర్వాత ఇద్దరి మధ్య విబేధాలు రావడంతో ఇద్దరు పిల్లులు పుట్టిన తర్వాత 2004లో విడాకులు తీసుకున్నారు. కరీనా కూడా గతంలో షాహిద్ కపూర్‌తో మూడేళ్ల పాటు ఘాటైన ప్రేమాయణం సాగించింది. ఆ తర్వాత అతనితో విడిపోయి సైఫ్‌తో బంధం ఏర్పరుచుకుంది. ఇక సోహా విషయానికొస్తే కునాల్ తో ప్రేమాయణం సాగిస్తున్న సోహా....అన్నయ్య పెళ్లి ఎప్పుడు అయిపోతుందా, బాయ్ ఫ్రెండ్‌ను ఎప్పుడు పెళ్లాడుదామా అని ఆతృతగా ఎదురు చూస్తోందని బాలీవుడ్ టాక్.


Click it and Unblock the Notifications











