twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'సీతమ్మవాకిట్లో...' పై రూమర్స్ అంటూ కొట్టిపారేసిన దిల్ రాజు

    By Srikanya
    |

    హైదరాబాద్: వెంకటేష్‌, మహేష్‌బాబు కాంబినేషన్ లో దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'. ఈ చిత్రం విడుదల తేదీని డిసెంబర్ 21 దిల్ రాజు ఖరారు చేసారు. అయితే ఈ చిత్రం షూటింగ్ పూర్తి కాలేదని ఆ టైమ్ కి విడుదల కాదని, సంక్రాంతికే విడుదల అవుతుందంటూ గత నాలుగు రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపధ్యంలో దిల్ రాజు అవన్నీ కేవలం రూమర్స్ అని, తాను ప్రకటించిన రిలీజ్ డేట్ కే విడుదల చేస్తానని ప్రకటించి అభిమానులకు ఆనదం కలిగించారు.

    దిల్ రాజు మాట్లాడుతూ..." మా మల్టి స్టారర్ చిత్రం నవంబర్ 20 కి టాకీ పార్ట్ షూటింగ్ పూర్తవుతుంది, కేవలం రెండు సాంగ్స్ మాత్రమే బ్యాలెన్స్ ఉంటాయి. అవి డిసెంబర్ మొదటి వారంలో పినిష్ చేస్తాము. పోస్ట ప్రొడక్షన్ వర్క్ ప్యారలల్ గా జరుగుతోంది. కాబట్టి ఫోస్ట్ పోన్ చేసే సమస్య లేదు. మేం అనుకున్న తేదీ అంటే డిసెంబర్ 21 కే విడుదల చేస్తాం ," అని ఆయన తేల్చి చెప్పారు. క్రిస్మస్ కానుకగా ఈ చిత్రం విడుదల చేయటం ద్వారా మంచి కలెక్షన్స్ ని ఆశిస్తున్నారు. సంక్రాంతికి అనుకున్నారు కానీ అప్పుడు చాలా సినిమాలు రిలీజ్ ఉండటంతో ఇలా ముందే ఈ సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.

    చిత్రం గురించి మాట్లుడుతూ...అన్న కోసం తమ్ముడు అడవులకు వెళ్లితే అది రామాయణం. ఆస్తి కోసం అన్నదమ్ములు తగువుకి దిగితే... అది నేటి భారతం. రక్తం ఎప్పుడైతే పంచుకొని పుట్టారో, అప్పటి నుంచి పంపకాలు అలవాటైపోయాయి అన్నారు. ఇక ఈ చిత్రం ఆడియో రైట్స్ కు కూడా మంచి డిమాండ్ వచ్చింది. ఆదిత్యా మ్యూజిక్ ఆడియో వారు ఈ చిత్రం రైట్స్ ని హెవీ కాంపిటేషన్ లో ఫ్యాన్సీ రేటుకు దక్కించుకున్నారు. మిక్కీజే మేయర్ ఈ చిత్రానికి మంచి మెలోడి మ్యూజిక్ అందించాడని,ఆడియో పెద్ద హిట్టవుతుందని భావిస్తున్నారు.

    అలాగే దర్శకుడు అడ్డాల శ్రీకాంత్ సినిమా గురించి చెపుతూ.. 'ఇందులో ఒక్క పాత్ర కూడా వృథాగా ఉండదు. ఒక్క సీన్ వేస్ట్‌గా ఉండదు. అంత పగడ్బందీ స్క్రీన్‌ప్లేతో సినిమాను రూపొందిస్తున్నాం. దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నన్ను దర్శకుడిగా పరిచయం చేసిన ఆయన బేనరులోనే రెండో సినిమా కూడా చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే ఉమ్మడి కుటుంబ నేపథ్యంలో సాగే కథే 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'. కథలో భావోద్వేగాలు అందరినీ కదిలిస్తాయి. వెంకటేష్‌, మహేష్‌బాబుల పాత్రలు అందరికీ గుర్తుండిపోతాయి. సీత పాత్ర కథలో చాలా కీలకం. ప్రకాష్‌రాజ్‌ మరోసారి ఓ ఉదాత్తమైన పాత్రలో కనిపిస్తారు. మల్టీస్టారర్‌ చిత్రాలకు ఈ సినిమా నాంది అవుతుంది అన్నారు.

    ఆస్తిపాస్తుల ముందు అన్నదమ్ముల బంధాలకు విలువ లేని కాలమిది. ఈ రోజుల్లోనూ ఆస్తుల్ని కాకుండా అనుబంధాల్నీ ఆప్యాయతల్నీ పంచుకొనే సోదరుల్ని మా చిత్రంలో చూపిస్తున్నామన్నారు. పేరులోనే కాదు, సినిమాలోనూ తెలుగుదనం కనిపిస్తుంది. ఇద్దరు హీరోలను ఒకే తెరపై చూపించడం మంచి కథ ఉంటేనే సాధ్యం. అలాంటి కథ ఈ సినిమాలో ఉంది. కుటుంబ విలువలకు పెద్దపీట వేశాము. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ గొప్పదనాన్ని, అనుబంధాల విలువనీ హృద్యంగా చెప్పే ప్రయత్నమిది అన్నారు . వెంకటేష్, మహేష్ బాబు అన్నదమ్ములుగా చేస్తున్నారు. సంగీతం: మిక్కీ జే.మేయర్‌, సహ నిర్మాతలు: శిరీష్‌, లక్ష్మణ్‌.

    English summary
    "By November 20th, we would be completing the talkie part of Seethamma Vaakitlo Sirimalle Chettu movie and two songs would be left to be canned. Those two songs will be filmed by first week of December. Post production work is also being done on parallel, so we don’t see any reason to postpone it the movie," Dil Raju said.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X